https://oktelugu.com/

Bigg Boss 6 Telugu : ఆదిరెడ్డితో సచ్చినా స్నేహం చెయ్యను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీహాన్..వైరల్ అవుతున్న వీడియో

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 ఎన్నో ఊహించని మలుపులతో, కంటెస్టెంట్స్ కోపతాపాలు మరియు భావోద్వేగాల మధ్య కొనసాగుతూ ఇప్పుడు చివరిదశకి చేరుకుంది..ఇక సీజన్ మొట్టమొదటి ఫైనల్ కంటెస్టెంట్ గా టికెట్ 2 ఫినాలే టాస్కు గెలిచి శ్రీహాన్ ఫినాలే వీక్ కి వెళ్ళిపోయాడు..ఇక వారం నామినేషన్స్ నుండి రోహిత్ కూడా నిన్న సేఫ్ అయిపోయాడు..జరిగిన వోటింగ్ ప్రకారం ఫైమా ఈ వారం బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్లబోతుంది అని […]

Written By:
  • NARESH
  • , Updated On : December 4, 2022 / 06:31 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 ఎన్నో ఊహించని మలుపులతో, కంటెస్టెంట్స్ కోపతాపాలు మరియు భావోద్వేగాల మధ్య కొనసాగుతూ ఇప్పుడు చివరిదశకి చేరుకుంది..ఇక సీజన్ మొట్టమొదటి ఫైనల్ కంటెస్టెంట్ గా టికెట్ 2 ఫినాలే టాస్కు గెలిచి శ్రీహాన్ ఫినాలే వీక్ కి వెళ్ళిపోయాడు..ఇక వారం నామినేషన్స్ నుండి రోహిత్ కూడా నిన్న సేఫ్ అయిపోయాడు..జరిగిన వోటింగ్ ప్రకారం ఫైమా ఈ వారం బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్లబోతుంది అని తెలుస్తుంది..ఇక ఈ ఆదివారం ఎపిసోడ్ మొత్తం ఫన్ తో నిండిపోనుంది.

    ప్రతి ఆదివారం నాగార్జున హౌస్ మేట్స్ కి విచిత్రమైన టాస్కులు ఇస్తూ ఉంటాడు..ఈసారి కూడా అలాంటి టాస్క్ ఇచ్చాడు..హౌస్ నుండి బయటకి వెళ్లిన తర్వాత ఎవరితో స్నేహం చేస్తారు..ఎవరితో స్నేహం చెయ్యకూడదు అనుకుంటున్నారు అని ఒక గేమ్ పెడుతాడు నాగార్జున..ఈ గేమ్ లో కంటెస్టెంట్స్ ఏమని సమాధానం ఇచ్చారో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.

    ముందుగా శ్రీహాన్ ని అడుగుతాడు నాగార్జున..అప్పుడు శ్రీహాన్ అందుకు సమాధానం చెప్తూ ‘రేవంత్ మరియు శ్రీ సత్య నాకు లైఫ్ టైం ఫ్రెండ్స్ సార్..కానీ ఇక్కడి నుండి బయటకి వెళ్లిన తర్వాత ఆది రెడ్డి గారితో మాత్రం స్నేహం చెయ్యలేను..ఎందుకంటే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అందరూ హైదరాబాద్ లోనే ఉంటారు..కానీ ఆది రెడ్డి ఎక్కడో ఉంటాడు..అక్కడకి వెళ్ళలేను’ అని సమాధానం ఇస్తాడు.

    ఇక ఆ తర్వాత రేవంత్ వంతు వస్తుంది.రేవంత్ సమాధానం చెప్తూ ‘శ్రీహాన్ – శ్రీ సత్య నాకు మొదటి నుండి మంచి స్నేహితులు అయ్యారు సార్’ అప్పుడు మధ్యలో ఆది రెడ్డి మాట్లాడుతుండగా రేవంత్ సమాధానం చెప్తూ ‘ఇక్కడ కూడా నాకు మాట్లాడే స్వతంత్రం ఇవ్వవా మామ’ అంటాడు..ఇక కీర్తి ఇనాయ పేరు చెప్తుంది..రోహిత్ ఆది రెడ్డి మరియు రేవంత్ పేర్లు చెప్తాడు..ఇక మిగిలిన కంటెస్టెంట్స్ ఏమి చెప్పారో తెలియాలంటే రాత్రి వరుకు ఎదురు చూడాలి.

    https://www.youtube.com/watch?v=nsEH48iQeLM