బిగ్ బాస్ నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పలువురు కంటెస్టెంట్లు ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోగా గేమ్ రసవత్తరంగా మారింది. ఇప్పటివరకు ఎవరు కూడా టైటిల్ ఫేవరేట్ కాకపోవడంతో కంటెస్టులంతా హౌస్ లోనే ఉండేందుకు పోటీపడుతున్నారు. 8వ వారం చివరి దశకు చేరుకోవడంతో ఎలిమినేషన్ పై జోరుగా చర్చ జరుగుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
8వ వారం నామినేట్ అయిన వారిలో హీరోయిన్ మొనాల్.. యాంకర్ లాస్య.. అరియానా.. అఖిల్.. మెహబూబ్.. అమ్మ రాజశేఖర్ ఉన్నారు. వీరిలో లాస్య.. అఖిల్.. అరియానాలకు ప్రేక్షకుల మద్దతు బాగా లభిస్తోంది. ఇక హీరోయిన్ మొనాల్ గజ్జల్ ఎప్పటిలాగే డిఫాల్ట్ గా సేవ్ కానుంది. మిగిలిన వారిలో మోహబూబ్.. అమ్మ రాజశేఖర్ డేంజర్ జోన్లో ఉన్నారు.
Also Read: రోజా ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్
కిందటివారం దివీ ఎలిమినేట్ అవడానికి కారణం డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ కారణమనే టాక్ ఉంది. అంతేకాకుండా అతడు నామినేషన్లలో ఎవరినో ఒకరిని బలి చేస్తూ ప్రతీసారి తప్పించుకుంటున్నాడు. ఈసారి నామినేషన్ అయిన సమయంలోనూ రాజశేఖర్ చెప్పిన కారణాలు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదని తెలుస్తోంది. దీంతో రాజశేఖర్ కు ఈసారి అందరి కంటే తక్కువగా ఓట్లు వచ్చినట్లు సమాచారం.
8వ వారంలో పోలైన ఓట్లలో అఖిల్‌కు 24శాతం.. లాస్యకు 23శాతం.. అరియానాకు 21శాతం.. మోనాల్‌కు 16శాతం.. మెహబూబ్‌కు 7శాతం.. అమ్మ రాజశేఖర్‌కు 6శాతం ఓట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రేక్షకుల ఓటింగ్ పరిశీలనలోకి తీసుకుంటే మాత్రం రాజశేఖర్ హౌస్ నుంచి వెళ్లే అవకాశం కన్పిస్తోంది. అయితే బిగ్ బాస్ నిర్వాహాకులు ప్రేక్షకుల ఓటింగ్ ను పెద్దగా పట్టించుకోకుండా స్క్రీప్ట్ ప్రకారంగా ఎలిమినేషన్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
Also Read: ఆర్ఆర్ఆర్: ఎన్టీఆర్.. చరణ్ లకు అలియా ట్వీస్ట్ ఇవ్వనుందా?
గతవారం అనుహ్యంగా దివీ ఎలిమినేట్ కాగా ఈ వారంలో అనారోగ్యం కారణంతో నోయల్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లాడు. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా? అనేది సందేహంగా మారింది. అదేవిధంగా ఈవారం వైల్డ్ కార్డు ఎంట్రీ ఉండనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతవారం సమంత హోస్టు చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ వారం నాగార్జునే హోస్ట్ చేయనుండటంతో ఎలిమినేషన్ ఉత్కంఠగా మారనుంది.