https://oktelugu.com/

SS Rajamouli: బిగ్ బ్రేకింగ్ : రాజమౌళి హీరో గా కొత్త సినిమా ప్రారంభం..మరి మహేష్ సినిమా పరిస్థితి ఏంటి?

SS Rajamouli: ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమోగిపోతున్న పేరు SS రాజమౌళి..గత ఏడాది ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో కలిసి ఈయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు..బాక్స్ ఆఫీస్ పరంగా #RRR ఎలాంటి అద్భుతాలు చూసిందో OTT లోకి వచ్చిన తర్వాత అంతకు మించి అద్భుతాలు సృష్టించింది..నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ సినిమాని ఇతర దేశాలకు చేనిన మూవీ లవర్స్ ఎగబడి మరీ చూసారు. ఫలితంగా ఈ చిత్రానికి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 23, 2023 / 03:11 PM IST
    Follow us on

    SS Rajamouli: ప్రపంచం మొత్తం ఇప్పుడు మారుమోగిపోతున్న పేరు SS రాజమౌళి..గత ఏడాది ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ తో కలిసి ఈయన సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు..బాక్స్ ఆఫీస్ పరంగా #RRR ఎలాంటి అద్భుతాలు చూసిందో OTT లోకి వచ్చిన తర్వాత అంతకు మించి అద్భుతాలు సృష్టించింది..నెట్ ఫ్లిక్స్ లో హిందీ వెర్షన్ లో విడుదలైన ఈ సినిమాని ఇతర దేశాలకు చేనిన మూవీ లవర్స్ ఎగబడి మరీ చూసారు.

    SS Rajamouli

    ఫలితంగా ఈ చిత్రానికి హాలీవుడ్ లో ఇప్పుడు వరుసగా ప్రతిష్టాత్మక అవార్డులు వస్తున్నాయి..ఇప్పటికే ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్’ మరియు ‘లాస్ ఏంజిల్స్ ఫిలిం క్రిటిక్స్’ అవార్డుని సొంతం చేసుకున్న ఈ చిత్రానికి అతి త్వరలోనే ఆస్కార్ అవార్డ్స్ కూడా రానుంది..అలాంటి అద్భుతాన్ని తీసిన రాజమౌళి దర్శకత్వ ప్రతిభ ని అవతార్ మరియు టైటానిక్ వంటి సినిమాలను తీసిన జేమ్స్ కెమరూన్ కూడా మెచ్చుకోవడం ఇప్పుడు సెన్సేషనల్ టాపిక్ అయ్యింది.

    దర్శకుడిగా మరో ఇండియన్ డైరెక్టర్ కలలో కూడా ఊహించని రేంజ్ కి చేరుకున్న రాజమౌళి ఇప్పుడు హీరో గా కూడా మన ముందుకి రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..ఇక అసలు విషయానికి వస్తే రాజమౌళి హీరో గా ఒక డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది..బాలీవుడ్ కి సంబంధించిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫిలిం కంపానిన్యం సంస్థలు కలిసి ‘,మోడరన్ మాస్టర్స్’ అనే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ తీస్తుంది..ఇందులో రాజమౌళి లీడ్ రోల్ చెయ్యబోతున్నాడు..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకి రాబోతున్నాయి.

    SS Rajamouli:

    డైరెక్టర్ గా ఎవ్వరూ చూడని రేంజ్ ని చూసిన రాజమౌళి ఇప్పుడు హీరో గా ఎంట్రీ ఇవ్వడం అందరికీ పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి..అయితే రాజమౌళి ఈ డాక్యుమెంటరీ లో నటిస్తే మరి మా మహేష్ బాబు సినిమా సంగతేంటి..స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్న సమయం లో రాజమౌళి ఇలా ద్రుష్టి మరలిస్తే సినిమా ఔట్పుట్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా అని మహేష్ ఫ్యాన్స్ భయపడుతున్నారు.

    Tags