
Bandla Ganesh- Pawan And Trivikram: నటుడు నిర్మాత బండ్ల గణేష్ మరో సంచలన ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లను ఉద్దేశిస్తూ పరోక్షంగా ఓ కామెంట్ చేశారు. తన ట్వీట్ ద్వారా దర్శకుడు త్రివిక్రమ్ ని టార్గెట్ చేశాడు. విషయంలోకి వెళితే, పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు బండ్ల గణేష్ ని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. మీరు కూడా పవన్ కళ్యాణ్ ని అపార్థం చేసుకొని దూరం కావద్దు. ఒంటరిగా యుద్ధం చేస్తున్న ఆయనకు మీలాంటి వాళ్ళు పెద్ద రిలీఫ్. ఇప్పటికే కొందరు ఆయనేమిటో అర్థం కాక దూరమయ్యారు. మీరు అలా చేయకండి. సమయం చూసుకొని ఒకసారి కలవండి, అంతా సెట్ అవుతుందని కామెంట్ పెట్టాడు.

పవన్ కళ్యాణ్ అభిమాని కామెంట్ కి బండ్ల గణేష్ స్పందించారు. మన దేవుడు మంచివాడే, ఆయన పక్కన ఉన్న డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లమ్ బ్రదర్, ఏం చేద్దాం’ అని ట్వీట్ చేశారు. ఇక్కడ డాలర్ శేషాద్రి అని చెప్పింది త్రివిక్రమ్ గురించే అనే సోషల్ మీడియా జనాల వాదన. గతంలో కూడా గురూజీ అంటూ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ ట్వీట్స్ వేశారు. పవన్ కళ్యాణ్ తనను దూరం పెట్టడానికి త్రివిక్రమ్ కారణమని బండ్ల గణేష్ భావన. అందుకే ఇలా తన అసహనం బయటపెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది.

గతంలో బండ్ల గణేష్ త్రివిక్రమ్ ని తిడుతున్న కాల్ రికార్డు లీకైంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాకు ఆహ్వానం అందలేదు. దానికి కారణం త్రివిక్రమే. పవన్ కళ్యాణ్ సినిమా వేడుకకు నేను రాకుండా అడ్డుకుంటున్నాడని బండ్ల గణేష్ కామెంట్స్ చేశాడు. బండ్ల గణేష్ ఆడియో పెద్ద సంచలనం రేపింది. అది నా వాయిస్ కాదని బండ్ల గణేష్ వివరణ ఇచ్చారు. అనంతరం అవును మాట్లాడింది నేనే. ఏదో కోపంలో ఒక మాట అన్నాను. తర్వాత కలిసి సారీ చెప్పాను. వివాదం అంతటితో ముగిసింది అన్నారు.
తన మిత్రుడు త్రివిక్రమ్ ని తిట్టిన బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ఆగ్రహానికి గురయ్యారట. అప్పటి నుండి పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ ని దూరం పెట్టారనే వాదన ఉంది. గతంలో బండ్ల గణేష్ తరచుగా పవన్ కళ్యాణ్ ని కలిసేవారు. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ అనంతరం పవన్-బండ్ల కలిసిన దాఖలాలు లేవు. మొత్తంగా బండ్ల గణేష్ తన దైవం పవన్ కళ్యాణ్ కి దూరమయ్యారు. దానికి త్రివిక్రమే కారణం అని బండ్ల గణేష్ భావన. తన అసహనాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తున్నారని అంటున్నారు.
మన దేవుడు మంచివాడు. కానీ డాలర్ శేషాద్రితోనే ప్రాబ్లం ఏం చేద్దాం బ్రదర్ ………! https://t.co/QwK0vGQlcZ
— BANDLA GANESH. (@ganeshbandla) March 18, 2023