Balakrishna Fans: కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన నందమూరి బాలకృష్ణ ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై యావరేజి రెస్పాన్స్ ని దక్కించుకుంది..అఖండ వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకొని బాలయ్య చేసిన సినిమా కావడం తో అభిమానులు ఈ చిత్రానికి చేసిన హంగామా ఇప్పుడు నేషనల్ మీడియా లో కూడా హాట్ టాపిక్ గా మారింది.

అభిమానుల అత్యుత్సాహం కారణంగా థియేటర్ లో లోపల క్రాకర్స్ కాల్చడం తో ఆ నిప్పు రవ్వ స్క్రీన్ పై పడి స్క్రీన్ తగలబడిపోయింది..ఆ విజువల్స్ ని మీరు క్రింద వీడియోలో చూడవచ్చు..ఇది గమనించిన థియేటర్ యాజమాన్యం వెంటనే సినిమాని ఆపివేసి ప్రేక్షకులను ఇంటికి పంపేశారు..ఈమధ్య కాలం లో ఇలా చాలా జరిగాయి..మొన్న విడుదలైన పవన్ కళ్యాణ్ ఖుషి రీ రిలీజ్ అప్పుడు కూడా అభిమానులు ఇలా థియేటర్స్ లో క్రాకర్స్ కాల్చడం వంటివి చేసారు.
అదృష్టం కొద్దీ ఈరోజు జరిగిన విధంగా థియేటర్స్ కి నష్టం అయితే ఎక్కడ జరగలేదు..కానీ ప్రభాస్ పుట్టినరోజు నాడు వేసిన బిల్లా స్పెషల్ షో కి తాడేపల్లిగూడెం లో ప్రభాస్ అభిమానుల అత్యుత్సాహం వల్ల థియేటర్ మొత్తం కాలిపోయింది..అభిమాన హీరో సినిమా విడుదలైతే సంబరాలు చేసుకోవడం లో ఎలాంటి తప్పు లేదు..కానీ ఆ సంబరాల కారణంగా థియేటర్స్ ప్రాపర్టీ ని నాశనం చెయ్యడం అనేది మంచి చర్య కాదు..సిల్వర్ స్క్రీన్ కాలిపోతే సదరు థియేటర్ యాజమాన్యం కి పడి లక్షల రూపాయిల వరకు నష్టం వాటిల్లుతుంది.

ఈరోజు వీర సింహా రెడ్డి సినిమా ప్రదర్శన లో కాలిపోయిన స్క్రీన్ ధర అక్షరాలా 20 లక్షల రూపాయిలు..ఇదే సంస్కృతి కొనసాగితే ఇక సినిమాలు విడుదల చెయ్యడానికి డిస్ట్రిబ్యూటర్స్ భయపడే రోజులు వస్తాయి..ఇప్పటికే అమెరికా లో తెలుగు సినిమాల స్క్రీనింగ్ చెయ్యడానికి భయపడుతున్నారు..కాబట్టి ఇక నుండి అయినా అభిమానులు హద్దులు దాటకుండా సంబరాలు చేసుకుంటే అందరికి శ్రేయస్కరమని బయ్యర్స్ అభిమానులకు విన్నవించుకుంటున్నారు.
Safety Patichandi pic.twitter.com/Vg3F10At4T
— Milagro Movies (@MilagroMovies) January 12, 2023