https://oktelugu.com/

NBK – PSPK : ఫోన్ కాల్ లో రామ్ చరణ్ ని ఫిట్టింగ్ మాస్టర్ అని పిలిచినా బాలయ్య.. పగలబడి నవ్వుకున్న పవన్ కళ్యాణ్

NBK – PSPK : అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఈ వచ్చే నెల మూడవ తారీఖున ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది..ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని నేడు విడుదల చేసారు..ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది..పవన్ కళ్యాణ్ లోని ఎవరికీ తెలియని కొన్ని కోణాలను బయటపెట్టించే ప్రయత్నం చేసాడు బాలయ్య. అందుకోసం ఫిట్టింగ్ మాస్టర్ గా పిలవబడే […]

Written By: , Updated On : January 27, 2023 / 08:15 PM IST
Follow us on

NBK – PSPK : అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురు చూసిన ‘అన్ స్టాపబుల్’ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఈ వచ్చే నెల మూడవ తారీఖున ఆహా మీడియా లో స్ట్రీమింగ్ కాబోతుంది..ఈ సందర్భంగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ని నేడు విడుదల చేసారు..ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది..పవన్ కళ్యాణ్ లోని ఎవరికీ తెలియని కొన్ని కోణాలను బయటపెట్టించే ప్రయత్నం చేసాడు బాలయ్య.

అందుకోసం ఫిట్టింగ్ మాస్టర్ గా పిలవబడే రామ్ చరణ్ కి కాల్ చేస్తాడు బాలయ్య..ప్రభాస్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ ఫోన్ చేసి ప్రభాస్ ని ఎలా ఆట పట్టిస్తాడో మన అందరం చూసాము..ఆ ఎపిసోడ్ ఆ రేంజ్ లో హిట్ అవ్వడానికి ప్రధాన కారణం రామ్ చరణ్ ఫోన్ కాలే..పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ లో కూడా రామ్ చరణ్ కి కాల్ చేస్తాడు బాలయ్య.

బాలయ్య మాట్లాడుతూ ‘ఏమయ్యా ఫిట్టింగ్ మాస్టర్..మొన్న ఏమో ప్రభాస్ కి ఫోన్ ఆడేసుకున్నావు..ఈరోజు మీ బాబాయ్ తో కూడా ఆడుకుంటావా’ అని అంటాడు..ఇక ఆ తర్వాత బాలయ్య పవన్ కళ్యాణ్ తో మాట్లాడుతూ ‘రామ్ చరణ్ తో నీకు ఉన్న అనుబంధం గురించి చెప్పమ్మా’ అంటాడు..అప్పుడు పవన్ కళ్యాణ్ చిన్నప్పటి నుండి నేనే కదా అన్ని వాళ్లకు దగ్గరుండి చూసుకుంది అంటాడు అప్పుడు బాలయ్య ‘అదేంటి నాగబాబు కూడా ఉన్నాడు కదా..ఆయన చూసుకోడా’ అని అంటాడు.

అప్పుడు పవన్ కళ్యాణ్ దానికి సమాధానం చెప్తూ ‘నాగ బాబు అన్నయ్య కూడా అప్పుడు నిర్మాతగా బాగా బిజీ కదా..కాబట్టి పిల్లల్ని నేనే చూసుకోవాల్సి వచ్చింది’ అని జవాబు ఇస్తాడు పవన్ కళ్యాణ్..అలా ఆద్యంతం వినోదభరితంగా సాగిపోయినట్టు అనిపిస్తున్న ఈ ఎపిసోడ్ వచ్చే నెల మూడవ తారీఖున ఆహా లో స్ట్రీమింగ్ కాబోతుంది.