Veera Simha Reddy: ఈ సంక్రాంతి కి నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం విడుదలై సూపర్ హిట్ స్టేటస్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే..కానీ ఈ సినిమాతో పాటుగా పోటీకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి దరిదాపుల్లో కూడా రాలేకపోయింది ఈ చిత్రం..’వాల్తేరు వీరయ్య’ సినిమాకి 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వస్తే ‘వీర సింహా రెడ్డి’ కి కేవలం 75 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.

కానీ బ్రేక్ ఈవెన్ నెంబర్ తక్కువ ఉండడం తో కమర్షియల్ గా సూపర్ హిట్ అని అనిపించింది వీర సింహా రెడ్డి చిత్రం..అంత వరకు అంతా బాగానే ఉంది..కానీ కొన్ని చోట్ల ఈ సినిమా ప్రెస్టీజియస్ మార్కుని అందుకోవడానికి నందమూరి అభిమానులు డబ్బులు కట్టి మరీ ఆడిస్తున్నారు..ఈ విషయం గోప్యంగా ఉన్నన్ని రోజులు బాగానే ఉంటుంది..కానీ ఒక్కసారి బయటపడిన తర్వాత పరువు మొత్తం పోతుంది.
ఇక అసలు విషయానికి వస్తే హైదరాబాద్ లో RTC క్రాస్ రోడ్స్ సెంటర్లో ఒక సినిమా కోటి రూపాయిల గ్రాస్ ని కొల్లగొడితే గొప్ప విషయం గా చెప్పుకుంటారు..అలా బాలయ్య గత చిత్రం ‘అఖండ’ ఇక్కడ కోటి రూపాయిల గ్రాస్ నీవు వసూలు చేసింది..ఈ సంక్రాంతి సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కోటి 40 లక్షలకు పైగా గ్రాస్ ని వసూలు చేసి ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది.

అయితే చిరంజీవి సినిమా ఆ రేంజ్ వసూళ్లు సాధించినప్పుడు, బాలయ్య సినిమాకి కనీసం కోటి రూపాయిలు కూడా రాకపోతే ఎలా అని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకొని ప్రతీ రోజు డైలీ కలెక్షన్స్ లో యాడ్ చేస్తూ ఉన్నారు నందమూరి అభిమానులు..ఇది చాలా తేలికగా తెలిసిపోతుంది..ఎందుకంటే ఈ సినిమాకి రెండవ వారం కూడా రానటువంటి వసూళ్లు ఇప్పుడు వస్తుండడమే..ఇలా అడ్డంగా దొరికిపోవడం తో నందమూరి అభిమానులు సైతం కౌంటర్ ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది.