https://oktelugu.com/

Hero Nani Balakrishna: హీరో నాని తాగే మద్యం బ్రాండ్ ఇదే.. బాలయ్య ముందు ఒప్పుకున్నాడు

Hero Nani Balakrishna: మనిషిన్నాక అప్పుడో ఇప్పుడో కాస్త కూస్తో మద్యం తాగే ఉంటారు. ఒకవేళ తాగని వారు కల్లు లాంటి చిరు పానీయాలు సేవించి ఉంటారు. అవి అలవాటు లేకపోతే ఇంకా ఏదైనా కాస్త రుచిచూసి ఉంటారు. మద్యానికి మనిషికి ఉన్న బంధం అలాంటిది మరీ. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నది వాస్తవం. మన జీవితంలో భాగమైన మద్యం సెలబ్రెటీల జీవితాల్లో ఇంకాస్తా ఎక్కువగా ఉంటుంది. వారు తాగే బ్రాండ్స్ పై ఆసక్తి ఉంటుంది.ఇప్పుడు నటరత్న బాలయ్య […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2021 / 02:50 PM IST
    Follow us on

    Hero Nani Balakrishna: మనిషిన్నాక అప్పుడో ఇప్పుడో కాస్త కూస్తో మద్యం తాగే ఉంటారు. ఒకవేళ తాగని వారు కల్లు లాంటి చిరు పానీయాలు సేవించి ఉంటారు. అవి అలవాటు లేకపోతే ఇంకా ఏదైనా కాస్త రుచిచూసి ఉంటారు. మద్యానికి మనిషికి ఉన్న బంధం అలాంటిది మరీ. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరన్నది వాస్తవం. మన జీవితంలో భాగమైన మద్యం సెలబ్రెటీల జీవితాల్లో ఇంకాస్తా ఎక్కువగా ఉంటుంది. వారు తాగే బ్రాండ్స్ పై ఆసక్తి ఉంటుంది.ఇప్పుడు నటరత్న బాలయ్య బాబు సెలబ్రెటీల మద్యం బ్రాండ్ లపై పడ్డాడు. వాళ్లు ఏమేం తాగుతారో కనుక్కునే పనిలో బిజీగా ఉన్నాడు.

    bala krishna Nani

    ‘అన్ స్టాపబుల్’ అంటూ టాలీవుడ్ అగ్రహీరో నందమూరి బాలక్రిష్ణ ‘ఆహా’ ఓటీటీలో చేస్తున్న షో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ షోలో ప్రముఖులను పిలిచి బాలయ్య చేస్తున్న ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. మొదట మోహన్ బాబు పిలిచి సంచలన విషయాలు రాబట్టాడు. ఇప్పుడు తాజాగా నేచురల్ స్టార్ నానిని తన షోకు ఆహ్వానించాడు.

    అయితే బాలయ్య బాబు షోలో అన్నింటికంటే డిఫెరెంట్ ఏంటంటే.. తను తాగే మద్యం బ్రాండ్ ‘మేన్సన్ హౌస్’ అని ఓపెన్ గా బాలయ్య ఒప్పేసుకుంటాడు. అలాగే ఆ మేన్షన్ హౌస్ తన కార్యక్రమానికి స్పాన్సర్ గా పెట్టేశాడు.

    తొలి షోలో మోహన్ బాబు తాగేది ‘విస్కీ’ బ్రాండ్ అని అతడిచేతనే చెప్పించాడు. సినిమాల్లోకి వచ్చిన తొలి నాళ్లలో తాను చెన్నై’లో సారా తాగేవాడిని అని మోహన్ బాబు చేత బాలయ్య చెప్పించేశాడు.

    తాజాగా నేచురల్ స్టార్ నాని బ్రాండ్ కూడా తాజాగా బయటపెట్టేశాడు బాలయ్య బాబు. బాలయ్య సాయంత్రం కాగానే తన నాన్న సినిమాలు చూస్తాడట.. అనంతరం కాస్త రిలాక్స్ అవ్వడానికి మేన్షన్ హౌస్ తాగుతాడట.. మరి నాని ఎలా రిలాక్స్ అవుతాడని బాలయ్య బాబు సూటిగా ప్రశ్నించాడు.దీనికి నాని ఆసక్తికరంగా స్పందించాడు.

    తాను సినిమాలు చూసి.. మ్యూజిక్ వింటూ రిలాక్స్ అవుతానని.. అప్పుడప్పుడూ ‘రెడ్ వైన్’ తాగి రిలాక్స్ అవుతానని నాని పంచుకున్నాడు. దీన్ని బట్టి నాని తాగే మద్యం బ్రాండ్ ‘రెడ్ వైన్’ అని బయటపడింది.

    ఇక వచ్చేవారం విక్టరీ వెంకటేశ్ ఇంటర్వ్యూకు వస్తున్నాడట.. మరి వెంకీమామ ఏ బ్రాండ్ తాగుతాడు? అసలు మద్యం తాగుతాడా? లేదా? అన్నది తేలనుంది.