Balakrishna Son Mokshagna: వినాయకుడు పెళ్లి ఎప్పుడంటే రేపు అనేది సామెత. మోక్షజ్ఞ ఎంట్రీకి ఈ సామెత చక్కగా సూట్ అవుతుంది. దాదాపు పదేళ్ల నుండి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. బాలయ్య నటరాసుడు మోక్షజ్ఞ వస్తే నెత్తిన పెట్టుకోవడానికి డై హార్డ్ ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు. టాలెంట్ తో సంబంధం లేకుండా స్టార్డమ్ తెచ్చేస్తాం అంటున్నారు. మోక్షజ్ఞ మాత్రం ఎటూ తేల్చడం లేదు. ఆయనకు అసలు ఆసక్తి ఉందా లేదా, అనే విషయం చెప్పడం లేదు. బాలయ్య చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీకి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు.

మోక్షజ్ఞ సమయం కావాలని చెబుతూ వాయిదా వేస్తూ వస్తున్నాడట. మోక్షజ్ఞలో హీరో కావాలనే కోరిక రగిలించేందుకు ఆయన బర్త్ డే వేడుకలు భారీగా నిర్వహిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఆ వేడుకలకు మోక్షజ్ఞ హాజరయ్యారు కూడా. గుంటూరు వేదికగా ఒక సామాజిక వర్గం మోక్షజ్ఞ బర్త్ డే వేడుకలు పెద్ద ఎత్తున జరుపుతూ ఉంటారు. ఎన్ని చేసినా మోక్షజ్ఞ ముఖానికి రంగు వేసుకోవడం లేదు. నటన పట్ల ఆసక్తి లేని మోక్షజ్ఞ వ్యాపారాలు చేసుకుంటానని అంటున్నట్లు ఓ వాదన ఉంది.
మోక్షజ్ఞ మనసు మార్చేందుకు బాలయ్య యజ్ఞయాగాలు కూడా చేయించాడట. వాస్తవ పరిస్థితి ఏదైనా బాలకృష్ణ మాత్రం ప్రతి ఏడాది నెక్స్ట్ ఇయర్ మోక్షజ్ఞ హీరోగా సినిమా చేస్తున్నాం అంటాడు. తాజాగా బాలకృష్ణ మరోసారి స్పందించారు. గోవా వేదికగా 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జరుగుతుంది. ఈ ఈవెంట్ కి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోక్షజ్ఞను హీరోగా వచ్చే ఏడాది పరిచయం చేస్తున్నాము అన్నారు. డైరెక్టర్ ఎవరనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో పరిచయం చేస్తారా? అని అడగ్గా అంతా దైవేచ్ఛ అన్నారు.

అయితే ఇటీవల బాలకృష్ణ వచ్చే ఏడాది తన దర్శకత్వంలో ఆదిత్య 999 ఉంటుంది అన్నారు. ఆదిత్య 369 సీక్వెల్ గా ఆ చిత్రం తెరకెక్కుతుందని చెప్పారు. ఈ క్రమంలో ఆదిత్య 999 హీరో మోక్షజ్ఞ కావచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేదికపై అఖండ మూవీ ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఈ సినిమా ఈవెంట్ లో బాలయ్య పాల్గొన్నారు. ఇక బాలయ్య లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.