Balakrishna- Rashmika Mandanna: అన్ స్టాపబుల్2 తో బాలయ్య అశేష ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. తన పదునైన మాటలతో ఆటపట్టిస్తూ నవ్వులు పూయిస్తున్నాడు. అభిమానుల హీరోలను గెస్టులుగా పిలిచి వారితో సరదాగా గడుపుతున్నాడు. తాజాగా శర్వానంద్, అడవిశేషు లు అన్ స్టాపబుల్2 అతిథులుగా వచ్చారు. వీరితో బాలయ్య వేసిన జోకులు పేలుతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో రష్మికను లైవ్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా ‘ఆ హీరోయిన్ తో ముద్దు వద్దే వద్దు’ అంటూ అడివి శేషు చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో బాలయ్య ఫుల్ జోష్ లో ఉన్నారు. అన్ స్టాపబుల్ 2 వేదికలో సీరియస్ గా పాల్గొంటూ ప్రేక్షకులకు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ షోపై ఆడియన్స్ కు విపరీతంగా ఆసక్తిపెరిగింది. దీంతో ప్రతీ వారం గెస్టులు ఎవరా..? అని ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో అన్ స్టాపబుల్ 2 మూడోవారంలో హీరోలు శర్వానంద్, అడవిశేషులను పిలిపించి వారితో నవ్వులు పూయించారు.
వచ్చీ రాగానే శర్వానంద్ ‘ఆయన పేరు బాలయ్య.. ఆయన ఎప్పటికీ బాలుడే’ అన్న మొదటి డైలాగ్ పేలుతోంది. దీంతో బాలకృష్ణ ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలి’ అంటూ పంచ్ లేస్తాడు. ఈ పంచ్ లకు ఆడియన్స్ గోలగోల చేస్తారు. ఇదే సమయంలో శర్వానంద్ రష్మికకు వీడియో కాలింగ్ చేస్తాడు. ఈ సమయంలో లైవ్‌లోకి వచ్చిన రష్మికతో ‘ఆ హీరోతో ముద్దు సీన్ వద్దేవద్దు’ అని అడవిశేషు అంటాడు. వెంటనే తేరుకున్న బాలయ్య ‘మీరెంత చెప్పినా ఎడిటింగ్ ఉండేది నా చేతిలోనే..’ అని అనడంతో సందడిగా మారుతుంది.

అన్ స్టాపబుల్ మొదటి పార్ట్ కంటే రెండో సీజన్ చాలా ఆసక్తికరంగా మారుతోంది. ఈ సీజన్ ప్రారంభంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడితో మొదలు పెట్టి షో కు హైప్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఈ వారం గెస్టులు ఎవరబ్బా..? అని ప్రేక్షకులు ఎదురుచూసే పరిస్థితికి వచ్చింది. ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి, తదితర ప్రముఖులు ఈ షో కు వచ్చారు. ఈ వారం అడవిశేషు, శర్వానంద్ లు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ త్వరలో అందుబాటులోకి రానుంది.