
Balagam Collections: ఇటీవల కాలం లో చిన్న సినిమాగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద స్థిరమైన వసూళ్లతో ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపొయ్యేలా చేస్తున్న చిత్రం ‘బలగం’.ప్రముఖ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన ఈ సినిమాకి విడుదలకు ముందు నుండే పైడ్ ప్రీమియర్ షోస్ ద్వారా పాజిటివ్ టాక్ వచ్చింది.ఇక గ్రాండ్ గా విడుదలైన తర్వాత మొదటి రోజు ఓపెనింగ్స్ కాస్త తక్కువే వచ్చినప్పటికీ టాక్ జనాల్లో బాగా వెళ్లిపోవడం తో వసూళ్లు రోజు రోజుకి పెరుగుతూ వచ్చాయి.
తెలంగాణ యాస, తెలంగాణ బాషా, తెలంగాణ గ్రామీణ సంస్కృతి మీద ఎంతో మక్కువ తో డైరెక్టర్ వేణు చేసిన ఈ విన్నూతన ప్రయత్నం కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన తీరు చూస్తూ ఉంటే, ఓటీటీ కాలం లో కూడా మంచి సినిమాలను ఇస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము అని ఈ సినిమా ద్వారా మరోసారి నిరూపించారు.
మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.కానీ గమ్మత్తు ఏంటంటే 8 వ రోజు మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు రావడమే.ట్రేడ్ పండితులు లెక్క ప్రకారం ఈ సినిమాకి 8 వ రోజు సుమారుగా 57 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.ఇది నిజంగా చరిత్ర తిరగరాయడమే అని చెప్పాలి.ఈ సినిమాకి వస్తున్న వసూళ్లను చూస్తూ ఉంటే గత ఏడాది విడుదలై సంచలనం సృష్టించిన ‘కాంతారా’ చిత్రం గుర్తుకు వస్తుంది.

ఆ సినిమా కూడా ఇంతే, రోజు రోజు కి కలెక్షన్స్ పెరుగుతూ సంచలనం సృష్టించి 450 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది.ఈ చిత్రానికి అంత గ్రాస్ అయితే రాదు కానీ, 20 కోట్ల రూపాయిల వరకు గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ సినిమాకి 3 కోట్ల 40 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు ట్రేడ్ పండితులు.