Balagam Actress Vijayalakshmi: సైలెంట్ గా వచ్చి సంచలనం సృష్టించిన బలగం గురించి ఇప్పుడు చర్చంతా. ఓ వైపు కామెడీతో నవ్విస్తూ అంతలోనే కన్నీళ్లు పెట్టిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో రన్ కావడం మాములు విషయం కాదు. ఓటీటీలో రిలీజైనా థియేటర్లోకి వెళ్లి ఈ సినిమాను చూసేందుకు ఇష్టపడుతున్నారు. కమెడియన్ వేణు డైరెక్షన్లోవచ్చిన ‘బలగం’ మూవీలో ప్రతి పాత్ర కీలకంగానే ఉంటుంది. ఇందులో హీరో, హీరోయిన్లు ఉన్నా సైడ్ పాత్రల్లో నటించిన వారే హైలెట్ అయిన విషయం గుర్తించవచ్చు. ఇందులో భాగంగా కొమురయ్య చెల్లెలుగా పోశవ్వ పాత్రలో నటించిన విజయలక్ష్మి కూడా ప్రత్యేకంగా నిలుస్తారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయలక్ష్మి తన పర్సనల్ విషయాలను బయటపెట్టింది. తన రియల్ జీవితమంతా విషాదమయం నెలకొందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.
గత నెల 3న రిలీజైన ‘బలగం’ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కుటుంబ విలువలు, బాధ్యతలు తెలిపే ఈ సినిమా చూసి చాలా మంది అన్నదమ్ములు ఒక్కటయ్యారు. భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమాలు వారం తిరగముందే థియేటర్ల నుంచి వెల్లిపోతున్నాయి. అలాంటిది ఈ మూవీ ఓటీటీలోరిలీజైనా థియేటర్లోచూసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ సందర్భంగా సినిమాలోని ప్రతి పాత్ర గురించి చర్చలు పెట్టుకుంటున్నారు. బలగం సినిమాలో కొమురయ్య చెల్లెలు పాత్ర పోశవ్వ అందరినీ ఆకట్టుకుంటుంది. సూటిపోటి మాటలతో నిందిస్తూ కన్నీళ్లు తెప్పిస్తుంది.
అయితే ఆమె పర్సనల్ లైఫ్ మాత్రం విషాదంగా మిగిలింది. చిన్నప్పటి నుంచి నాటకాల్లో పాల్గొన్న విజయలక్ష్మికి సినిమాలపై ఆసక్తి ఉండేంది. కానీ ఇప్పటి వరకు సినిమాల్లో నటించే అవకాశం దొరకలేదు. ఎందుకంటే పెళ్లయిన కొన్నాళ్లకే భర్త చనిపోయాడు. ఆ తరువాత ఇద్దరు కొడుకులను పెంచే బాధ్యత విజయలక్ష్మినే తీసుకున్నారు. అలా పెంచి పెద్ద చేశాక ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. అయితే తన చిన్న కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సమయంలో అతడి భార్య గర్భవతి. ఈ సంఘటనపై ఇప్పటికీ కోలుకోలేకపోతున్నానని ఆమె కన్నీళ్లు పెడతూ చెప్పింది.
ఇక విజయలక్ష్మికి నాటకాలు వేసిన సమయంలో ఎన్నో అవార్డులు వచ్చాయి. హరికథలు కూడా విజయలక్ష్మి చెప్పేవారు. అయితే ఆమె నటించిన మొదటి సినిమా బలగం నే కావడం విశేషం. వేణు డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ కోసం పనిచేస్తున్నప్పుడు ఎంతో ఉత్సాహాన్నిచ్చిందని ఆమె చెప్పారు. ఈ సినిమా నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడ్డారని, వారి కష్టానికి ఫలితమే నేటి విజయం అని విజయలక్ష్మి చెప్పారు.