Homeఆంధ్రప్రదేశ్‌Nandamuri Taraka Ratna: చెడు కొవ్వు యమ డేంజర్: తారకరత్న కు నరకం చూపిస్తోంది

Nandamuri Taraka Ratna: చెడు కొవ్వు యమ డేంజర్: తారకరత్న కు నరకం చూపిస్తోంది

Nandamuri Taraka Ratna: తారకరత్న అరుదైన మెలానియా వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ వ్యాధి వల్ల అంతర్గతంగా రక్తస్రావం అవుతుంది.. దీనికి కారణం రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వే ప్రధాన కారణం.. దీనికి తోడు అదుపులేని మధుమేహం కారణంగా ఒక్కసారిగా మనిషి కుప్పకూలిపోయాడు.. అందుకే ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది.. ప్రస్తుత పరిస్థితుల్లో పాతికేళ్ల యువకులు కూడా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు.. ఇందుకు కారణం కొవ్వు అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవటమే… శారీరక వ్యాయామం లేకపోవడం… జంక్ ఫుడ్ కు అలవాటుపటం… జన్యుపరమైన కారణాలు గుండె సంబంధిత జబ్బులకు దారితీస్తున్నాయి.. ఇలాంటి సమయంలో మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును, గుండెకు హాని కలిగించే కొవ్వును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన దేహంలో లో డెన్సిటీ లైపో ప్రోటీన్, హై డెన్సిటీ లైపో ప్రోటీన్ అనే రెండు రకాల కొవ్వులు ఉంటాయి.. ఇందులో లో డెన్సిటీ లైపో ప్రోటీన్ శరీరానికి హాని కలిగిస్తుంది.. ఇది ఎక్కువైతే ఒక రక్తనాళాల్లో రక్తం సరఫరా లో అడ్డంకులు ఏర్పడతాయి.. ఇది అంతిమంగా గుండెపోటుకు దారితీస్తుంది.

Nandamuri Taraka Ratna
Nandamuri Taraka Ratna

చెడు కొవ్వుతో గుండె జబ్బులు పెరిగిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల వినియోగం వల్ల గుండె రక్తనాళాల్లో చెడు కొవ్వు ఎక్కువగా పేరుకు పోతోంది.. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఉంటాయి.. ప్రపంచంలో జరిగే మరణాల్లో 60 శాతం గుండెపోటు మరణాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. 2019లో ప్రపంచ వ్యాప్తంగా అనారోగ్యకర ఆహార వల్ల 80 లక్షల మంది చనిపోయారని పేర్కొన్నది.. భారతదేశంలో 2019లో నిర్వహించిన అధ్యయన ప్రకారం ఆ ఏడాది 1.44 లక్షల మంది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అధిక వాడకం వల్ల చనిపోయారు.. ఆగ్నేయ ఆసియా దేశాల్లో ట్రాన్స్ పార్టీ యాసిడ్స్ అధిక వినియోగం వల్ల జరిగిన 1.78 లక్షల మరణాల్లో 80% భారత దేశంలోనే సంభవించాయి. యూరప్ లో 1.25 లక్షల మంది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అధిక వినియోగం వల్ల చనిపోయారు.. 2022లో నిర్వహించిన పరిశోధనలో ఉజ్బెకిస్తాన్ జనాభాలో 12% మందికి గుండె జబ్బులు ఉన్నాయని తేలింది.. ప్రపంచంలో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కారణంగా సంభవించే గుండెపోటు మరణాల్లో ఈజిప్టు మొదటి స్థానంలో ఉండగా భారత్ 11వ స్థానంలో ఉంది..

ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే..

ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనం తీసుకునే ఆహారం వల్ల ఏర్పడే కొవ్వు ఆమ్లాలు. ఇది చెడు కొవ్వు.. అంటే ఆరోగ్యానికి హానికరం.. గ్రాము ట్రాన్స్ ఫ్యాట్ లో 9 క్యాలరీలు ఉంటాయి.. ఆహారంలో ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.. ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బులు సంభవిస్తాయి.. వంటనూనె, వేపుళ్ళు, చేసిన లేదా శుద్ధి చేసిన ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కుకీలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిల్లోనూ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. గుండె జబ్బులతో పాటు మధుమేహం రక్తపోటు ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.. శరీరానికి ట్రాన్స్ ఫ్యాట్ అవసరం లేదు. దాన్ని నివారించాల్సిందే.. ప్రతి 100 గ్రాముల ఫ్యాట్లో రెండు శాతానికి మించి, కేలరీల్లో 0.5% నుంచి ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

Nandamuri Taraka Ratna
Nandamuri Taraka Ratna

ప్రపంచంలో 60 దేశాలు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ నియంత్రణ పరిధిలోకి వచ్చాయి.. గత ఏడాది జనవరిలో భారత్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ నియంత్రణను అమలులోకి తీసుకొచ్చింది.. అన్ని దేశాల్లోనూ ఈ ఏడాది చివరి కల్లా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ నియంత్రించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.. ఆ ప్రకారం పాక్షికంగా శుద్ధి చేసిన వంట నూనెలను నిషేధించాలి.. పూర్తిగా శుద్ధి చేసిన నూనెలను వాడాలి. ఆహార పదార్థాల్లో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎంత మేర ఉన్నాయో ప్యాకెట్లపై ముద్రించాలి.. నూనె, కొవ్వు వినియోగాన్ని తగ్గించాలి.. ఇక ప్రపంచవ్యాప్తంగా 46 దేశాల్లో ఇప్పటికీ 32 కోట్ల మంది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకుంటున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular