https://oktelugu.com/

Baby (2023) Collections : 6 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్.. మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయో తెలిస్తే నోరెళ్లబెడుతారు!

అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకు కలిపి దాదాపుగా 120k డాలర్స్ వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం కోటి రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు అన్నమాట.

Written By:
  • NARESH
  • , Updated On : July 14, 2023 / 10:24 PM IST

    Baby Movie Review

    Follow us on

    Baby (2023) Collections : యూత్ ఆడియన్స్ ని ఈమధ్య కాలం లో విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ఒకటి ‘బేబీ’. ఆనంద్ దేవరకొండ హీరో గా, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ సినిమా టీజర్, పాటలు మరియు ట్రైలర్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచేసాయి. అలా భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ఉదయం ఆటల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ని దక్కించుకుంది.

    అనకాపల్లి నుండి అమెరికా వరకు ఓపెనింగ్స్ విషయం లో కళ్ళు చేదిరిపోయే రేంజ్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి ఓవరాల్ గా మొదటి రోజు అన్నీ ప్రాంతాల నుండి ఎంత వసూళ్లు వచ్చాయో, రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఎంత ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది?? బ్రేక్ ఈవెన్ కి ఎంత వసూళ్లు రావాలి అనేది ఒకసారి చూద్దాం.

    ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 6 కోట్ల రూపాయిలకు జరిగినట్టు గా అనిపిస్తుంది. అమెరికా లో ఈ చిత్రానికి ప్రీమియర్స్ మరియు మొదటి రోజుకు కలిపి దాదాపుగా 120k డాలర్స్ వసూలు చేసింది. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం కోటి రూపాయిలకు పైగా గ్రాస్ వసూళ్లు అన్నమాట.

    ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వసూళ్లు దాదాగా మూడు నుండి నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.. తెలంగాణ లో అయితే ఈ సినిమాకి మొదటి రోజు రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమాకి కోస్తాంద్ర లో నూన్ షోస్ తో పోలిస్తే మ్యాట్నీ షో కలెక్షన్స్ చాలా బాగా డ్రాప్ అయ్యింది. సీడెడ్ లో కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఓవరాల్ ది ఈ చిత్రం మొదటి రోజు దాదాపుగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్ళను రాబట్టిందని, జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ లో 99% శాతం మొదటిరోజే రికవరీ అయిపోయిందని అంటున్నారు. రాబోయ్యే రోజుల్లో ఈ సినిమా ఇంకెంత వసూళ్లను రాబట్టబోతుందో చూడాలి.