
Pawan Kalyan- Ram Charan: నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే. 1985 మార్చి 27న జన్మించిన చరణ్ 38వ ఏట అడుగుపెట్టారు. రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు వరల్డ్ వైడ్ ఘనంగా నిర్వహిస్తున్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అభిమానుల కోసం ఆరెంజ్ మూవీ ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. అయితే బాబాయ్ పవన్ కళ్యాణ్ దీవెనలు చరణ్ కి చాలా స్పెషల్. ప్రతి పుట్టిన రోజుకు పవన్ కళ్యాణ్ చరణ్ కి గిఫ్ట్ ఇస్తారట.
ఈ ఏడాది ఆయన ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు? దాని విలువ ఎంత? అనేది తెలియాల్సి ఉంది. అయితే కోట్ల రూపాయల విలువ చేసే భౌతికమైన బహుమతులకు మించినది పవన్, రామ్ చరణ్ కి ఇచ్చారు. ఓ అరుదైన ఫోటో షేర్ చేశారు. చరణ్ నెలల బాలుడిగా ఉన్నప్పుడు బారసాల నిర్వహించారు. ఆ సమయంలో పవన్ అక్షింతలు వేసి చంటి పిల్లాడైన చరణ్ ని ఆశీర్వదిస్తున్నారు. ఈ రేర్ అండ్ అన్ సీన్ పిక్ పవన్ కళ్యాణ్ షేర్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
చిన్నప్పటి నుండి పవన్-చరణ్ మధ్య విడదీయరాని బంధం ఉంది. సినిమాల్లోకి రాకముందు పవన్ ఇంట్లో ఖాళీగా ఉండేవారట. అప్పుడు పిల్లలను చూసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ దేనట. వదిన సురేఖ పనుల్లో బిజీగా ఉంటే చిరంజీవి పిల్లలను పవన్ ఆడిస్తూ ఉండేవాడట. ఈ విషయాన్ని పవన్ స్వయంగా చెప్పారు. మరొక ఆసక్తికర విషయం ఏమిటంటే… చరణ్ వద్ద పవన్ అప్పు చేశాడట. హీరో అయ్యాక కూడా పవన్ దగ్గర డబ్బులు ఉండేవి కావట.

వదినను అడుగుదామంటే… సినిమాల్లో నటిస్తున్నాడు, ఇంకా డబ్బులు అడుగుతున్నాడేంటని అనుకుంటుదేమో అని ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడట. ఎవరిని అడగాలో తెలియక చరణ్ దగ్గర అప్పు తీసుకునేవాడట. నీకు వడ్డీతో సహా కలిపి ఇచ్చేస్తా అని చెప్పేవాడట. చరణ్ పాకెట్ మనీగా తీసుకున్న డబ్బులు దాచి పవన్ కళ్యాణ్ కి అప్పుగా ఇచ్చేవాడట. ఆ డబ్బులు ఇంకా తిరిగి ఇవ్వలేదని పవన్ చిరుత మూవీ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.