Tender Survey: శృంగారం విషయంలో మనవారు వెనుకబడే ఉన్నారు. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందంటారు. ఆడవారిని ఆకట్టుకునే కళ అందరికి ఉండదు. కొందరు ఇట్టే పడేస్తారు. మరికొందరికి సంవత్సరాలైనా తమ ప్రేమను వ్యక్తం చేయలేరు. ఫలితంగా భయంతో అంతా పాడు చేసుకుంటారు. అమ్మాయిలను ఆకట్టుకోవడం కూడా ఓ కళే. అందులో ఆరితేరితేనే వాడికి తిరుగుండదని తెలుస్తుంది. కానీ నేటి తరం కుర్రాళ్లు కెరీర్ పై ఉన్న ఏ అంశాలను పట్టించుకోవడం లేదు. దీంతో వారికున్న భయంతోనే నిరంతరం సంఘర్షణకు గురవుతున్నారు. అమ్మాయిలను ఆకట్టుకోలేకపోతున్నారు.

అబ్బాయిల విషయంపై టెండర్ అనే సంస్థ ఓ సర్వే నిర్వహించింది. అందులో వెల్లడైన విషయాలు విస్తు గొలుపుతున్నాయి. మగ జాతికే కళంకం తెస్తున్నాయి. ఆడవారిని ఎలా ఆకట్టుకోవాలో కూడా తెలియదని చెప్పడం గమనార్హం. ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోతోంది. విదేశాల్లో డేటింగులు పెరుగుతున్నాయి. పెళ్లి కాకుండానే కొన్ని రోజులు ఇద్దరు కలిసుండి వారికి నచ్చితేనే పెళ్లి లేదంటే ఎవరి దారి వారు చూసుకోవడమే. దీనికి ప్రపంచంలో చాలా మంది ఆకర్షితులవుతున్నారు. వివాహానికి ముందే డేటింగ్ చేసుకుని నచ్చితే పెళ్లి లేదంటే విడిపోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
మన హైదరాబాద్ కుర్రాళ్లు మాత్రం అమ్మాయిని డేటింగుకు ఎలా పిలవాలి? ఒకవేళ ఆమె వస్తే ఏం మాట్లాడాలి? తనను ఎలా ఇంప్రెస్ చేయాలనే అనుమానాలతోనే సతమతమవుతున్నారు. దీంతో వారు ఇక డేటింగ్ చేసేదెప్పుడు? అమ్మాయి మనసు దోచుకునేదెప్పుడు? తన కలలు పండించుకునేదెప్పుడు? ప్రపంచంతో పాటు మనమూ మారాలి డ్యూడ్. లేకపోతే మనుగడ ఉండదు. అమ్మాయిల విషయంలో అంత బలహీనంగా ఉంటే ప్రమాదమే. వేగవంతమైన ప్రపంచంలో మనం కూడా వేగాన్ని అందుకోవాలి. లేదంటే వెనకే ఉంటాం.

అమ్మాయిలతో డేటింగ్ విషయంలో ప్రతి పదిమందిలో ఆరుగురు డేటింగ్ కు ఎలా వెళ్లాలి? వెళితే ఎలా మాట్లాడాలి? రొమాంటిక్ గా అమ్మాయిని ఎలా ఆకట్టుకోవాలనే అనుమానాలు వ్యక్తం చేస్తే ఇంకేముంది మగవారి పరువు తీశారు. ఇలాగైతే వీరు అమ్మాయిలను పడేయడం కాదు వారు పడేసినా మాకు తెలియదని చెబుతారనే కామెంట్లు వస్తున్నాయి. కాలం మారుతున్నా వారి ప్రవర్తనలో మార్పు రానంత వరకు ఇలాగే ఉంటారు. కెరీర్ ఒకటే ముఖ్యం కాదు. జీవితం కూడా ఇంపార్టెంటే. కాబోయే జీవిత భాగస్వామిని కూడా సరైన వారిని ఎన్నుకుంటేనే బతుకు బండి హాయిగా సాగుతుంది. లేదంటే సమస్యల వలయంలో చిక్కుకుంటుందని వారు తెలుసుకుంటే మంచిది.