
Manchu Vishnu- Manoj: ధనం మూలం ఇదం జగత్ అంటారు. ఈ ప్రపంచాన్ని నడిపించేది విటమిన్ ‘ఎమ్’. డబ్బు ఏ ఇద్దరి మధ్య అయినా చిచ్చు పెడుతుంది. మంచు బ్రదర్స్ మధ్య మనస్పర్ధలకు ఆర్థిక వ్యవహారాలే కారణమని తెలుస్తోంది. మొదటి నుండి బ్రదర్స్ నడుమ కోల్డ్ వార్ నడుస్తుంది. మోహన్ బాబు ఎవరి వైపు?. ఎవరి కెరీర్ కి మద్దతిస్తున్నారు? అడిగినంత డబ్బులిచ్చి ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? అనే ఒక ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయంలో మంచు విష్ణుకే ఆయన ఎక్కువ ప్రయోజనం చేశారు. మంచు విష్ణును మోహన్ బాబు ‘విష్ణు’ మూవీతో భారీగా లాంచ్ చేశాడు. విష్ణు చిత్ర బడ్జెట్ 20 ఏళ్ల క్రితమే రూ.18 కోట్లు అని సమాచారం.
అదే సమయంలో మనోజ్ ని జస్ట్ ఒక డబ్బింగ్ మూవీతో సాదాసీదా లాంచ్ చేశాడు. దొంగ దొంగది చిత్రంతో మనోజ్ హీరో అయ్యాడు. అనూహ్యంగా కోట్లు పెట్టిన ‘విష్ణు’ మూవీ అట్టర్ ప్లాప్. దొంగ దొంగది చిత్రం మాత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. హీరోలుగా ఒక స్థాయికి ఎదిగి కోట్లు తెచ్చిపెడతారని మోహన్ బాబు భావించారు. కానీ వారు టైర్ టైర్ టు హీరోల్లో కూడా జాయిన్ కాలేకపోయారు. రెండు దశాబ్దాలుగా మోహన్ బాబు కొడుకుల మీద పెట్టుబడి పెడుతూనే ఉన్నారు. మనోజ్, విష్ణులతో బయట నిర్మాతలు సినిమాలు తీసే పరిస్థితి లేదు.

మోసగాళ్లు టైటిల్ తో మంచు విష్ణు భారీ మూవీ చేశారు. సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన మోసగాళ్లు చిత్రంలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి వంటి స్టార్ క్యాస్ట్ నటించారు. ఫలితం మాత్రం రిపీట్. మోసగాళ్లుతో విష్ణు మోహన్ బాబుకు కోట్ల నష్టాలు తెచ్చారు. ఆ దెబ్బతో మనోజ్ చేయాలనుకున్న అహం బ్రహ్మస్మి అటకెక్కింది. మనోజ్ ప్రకటించిన అహం బ్రహ్మస్మి చిత్రానికి కోట్లు పెట్టేందుకు మంచు ఫ్యామిలీ వెనకాడింది. దాంతో మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది మనోజ్ లో మోహన్ బాబు, విష్ణుల మీద అసహనం ఏర్పడేలా చేసింది.
ఇలా ఒక రకమైన మానసిక సంఘర్షణ మంచు ఫ్యామిలీలో నడుస్తుంది. అది ఎట్టకేలకు బరస్ట్ అయ్యింది. చెప్పాలంటే మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములు కాదు. స్టెప్ బ్రదర్స్. మోహన్ బాబు మొదటి భార్య విద్యాదేవికి లక్ష్మి, విష్ణు పుట్టారు. విద్యాదేవి మరణంతో ఆమె చెల్లెలు నిర్మలా దేవిని మోహన్ బాబు రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు మనోజ్ పుట్టాడు. తల్లులు వేరైన ఈ అన్నదమ్ముల మధ్య ఆస్తుల విషయంలో ఏర్పడిన వివాదాలు మరింత దూరం పెంచాయి. చివరికి ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే స్థాయికి వెళ్లారు.