Anushka Video Call On Prabhas: ‘అన్ స్టాపబుల్ విత్ NBK ‘ టాక్ షో రెండవ సీజన్ ప్రస్తుతం రికార్డు స్థాయి రేటింగ్స్ తో ఇండియాలోనే నెంబర్ 1 టాక్ షో గా ఆహా మీడియా లో దూసుకుపోతుంది.. ఈ రెండవ సీజన్ మొత్తం మీద ప్రభాస్ ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా విభజన చేసి మొదటి భాగం ని డిసెంబర్ 30 వ తేదీన స్ట్రీమ్ చెయ్యగా,రెండవ భాగాన్ని నిన్న రాత్రి విడుదల చేసారు.

మొదటి పార్ట్ కి ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో , రెండవ పార్ట్ కి కూడా అదే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది..ఈ ఎపిసోడ్ లో కూడా ప్రభాస్ లోని తన ఫన్ యాంగిల్ ని మొత్తం బయటపెట్టేసాడు..కానీ ప్రభాస్ ని ఆయన స్నేహితులు మాత్రం తెగ ఆడేసుకున్నారు..మొదటి పార్ట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ప్రభాస్ కాల్ చెయ్యగా, రామ్ చరణ్ ప్రభాస్ ని తెగ ఏడిపిస్తాడు.
ఇక రెండవ పార్ట్ లో ప్రభాస్ మరో బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ పాల్గొంటాడు..ఆయన కాసేపు ప్రభాస్ ని సరదాగా ఆటపట్టిస్తాడు..ఇలా మా వాడిని అమాయకుడిని చేసి అందరూ ఆడేసుకుంటున్నారు అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు..ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య మాట్లాడుతూ ‘నీకు అనుష్క కి మధ్య ఏమి నడుస్తుంది’ అని అడుగుతాడు..తాను నాకు మంచి స్నేహితురాలు సార్ అని బదులిస్తాడు ప్రభాస్.

అప్పుడు బాలయ్య ‘అవునా..ఉండు ఆమెకి వీడియో కాల్ చేసి కనుక్కుందాం’ అని అనుష్క కి వీడియో కాల్ చేస్తాడు..కాసేపు బాలయ్య తో గోపీచంద్ తో మాట్లాడిన తర్వాత, ప్రభాస్ తో మాట్లాడుతుంది అనుష్క..అలా వాళ్లిద్దరూ కాసేపు మాట్లాడుకుంటున్న సమయం లో బాలయ్య బాబు ‘వదిలేస్తే సాయంత్రం వరకూ మాట్లాడుకుంటూనే ఉండేలా ఉన్నారుగా’ అని అంటాడు..అలా ఈ ఎపిసోడ్ మొత్తం ఫుల్ ఫన్ తో నిండిపోతుంది..చూడాలనుకునేవాళ్ళు వెంటనే ఆహా యాప్ లో లాగిన్ అయ్యి చూసేయండి.