Apsara Case: సంచలనం రేకెత్తిస్తున్న అప్సర వ్యవహారంలో రోజుకో కొత్త కోణం వెలుగు చూస్తోంది. పూజారి సాయికృష్ణ, అప్సరకు శారీరక బంధం ఉందని, ఆమె గర్భం దాల్చడంతోనే హతమార్చాడని ప్రచారం జరిగింది. అంతేకాదు అప్సర వేధింపుల తట్టుకోలేకే సాయికృష్ణను ఆమెను హతమార్చాడని వదంతులు వ్యాపించాయి. ఇవి ఇలా ఉండగానే ఆదివారం అప్సర మరో యువకుడిని పెళ్లి చేసుకున్నట్టు ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్టు కొట్టాయి. ఇది జరుగుతుండగానే అప్సరకు సంబంధించిన మరో విషయం వెలుగులోకి వచ్చింది.
అంతకుముందే పెళ్లయిందా?
పూజారి సాయికృష్ణతో అప్సరకు మధ్య నడిచిన వ్యవహారానికి ముందే ఆమెకు తమిళనాడు రాష్ట్రం చెన్నైకి చెందిన కార్తీక్ రాజా అనే యువకుడికితో కలిసి ఉన్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. వాస్తవానికి అప్సర తమిళనాడు రాష్ట్రానికి చెందిన అమ్మాయి. ఈమె కార్తీక్ రాజా అనే యువకుడితో ప్రేమలో పడింది. ఇదే విషయాన్ని కార్తీక్‌రాజా తన ఇంట్లో చెప్పడంతో అతడి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కొడుకు అదే పనిగా ఆ అమ్మాయినే కలవరిస్తుండటంతో పెళ్లికి ఒప్పుకున్నారు. కరోనా సమయంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేశారు. ఈ పెళ్లికంటే ముందే అప్సర అక్కా, బావ మీద పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదయింది. ఈ విషయంత కార్తీక్ తల్లిదండ్రులకు తెలియడం, వారు అతడిని అడగడంతో కొత్త మేర మనస్పర్థలు తలెత్తాయి. తర్వాత వారు పోలీస్ స్టేషన్ నుంచి విడుదల కావడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. ఇక అప్పర, కార్తీక్ పెళ్లి చేసుకున్న తర్వాత వేరు కాపురం పెట్టారు. వారు వేరే కాపురం పెట్టేందుకు అవసరమైన సామగ్రిని కార్తీక్ తల్లి సమకూర్చింది.
వేధించేదా?
కార్తీక్ తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. అప్సర హై ఫై లైఫ్ కోరుకునేది. సకల సౌకర్యాలను అనుభవించాలని అనుకునేది. వీటంన్నింటినీ సమకూర్చాలని కార్తీక్ మీద ఒత్తిడి తెచ్చేది. తాను కోరినవన్నీ ఇస్తే కార్తీక్‌తో మంచిగా ఉండేది. లేకుంటే అతడితో తగువు పెట్టుకునేది. ఈవిషయాలన్నీ తల్లితో చెప్పుకుని కార్తీక్ బాధపడేవాడు. పైగా అప్సర అస్తమానం ఫోన్లో మాట్లాడుతోందని, తనను పట్టించుకోవడం లేదని కార్తీక్ ఆమెకు విడాకులు ఇచ్చాడు. తర్వాత కొద్ది రోజులకే మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి అతడి తల్లిదండ్రులు కూడా మానసికంగా కుమిలిపోయారు.
టీవీల్లో చూసి..
అప్సర ఉదంతానికి సంబంధించి టీవీల్లో వార్తలు వస్తుండటంతో కార్తీక్ తల్లి స్పందించారు. తన కొడకు, అప్సరకు మధ్య జరిగిన వ్యవహారానికి సంబంధించి ఒక వాయిస్ మేసేజ్‌ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో అప్సర ఉదంతం మరో మలుపు తిరిగింది. దీనిపై అప్సర తల్లిదండ్రులను వివరణ కోరితే.. ‘అంతా పై వాడే చూసుకుంటాడని’ చెప్పారు. పెళ్లి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తే వారు సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారు. దీంతో అప్సర కేసును ఎలా విచారణ చేయాలో అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొన్నటి దాకా సాయికృష్ణ అప్సరను హతమార్చాడని వార్తలు వచ్చాయి. అప్సర అమాయకురాలని కామెంట్లు విన్పించా యి. కార్తీక్ అనే వ్యక్తి ప్రస్తావన తెరపైకి రావడంతో అనూహ్యంగా మరో మలుపు తిరిగింది.