Tripti Dimri : ఒక్క సినిమాతో తృప్తి దిమ్రి పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ మూవీ 2023కి గాను బాలీవుడ్ అతిపెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. ఏకంగా రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రన్బీర్ కపూర్ హీరోగా నటించగా రష్మిక మందాన హీరోయిన్ గా చేసింది. బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక రోల్స్ చేశారు. యానిమల్ మూవీ అత్యంత వివాదాస్పద చిత్రంగా పేరుగాంచింది. పలువురు చిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు యానిమల్ మూవీలోని కంటెంట్ ని ఖండించారు. ఇది సమాజానికి చెడు చేసే చిత్రమంటూ మండిపడ్డారు.
ప్రేక్షకులు మాత్రం యానిమల్ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. భారీ విజయం కట్టబెట్టారు. కాగా ఈ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది తృప్తి దిమ్రి. అందుకు కారణం.. తృప్తి దిమ్రి అత్యంత బోల్డ్ రోల్ చేసింది. హీరో రన్బీర్ కపూర్ తో శృంగార సన్నివేశాల్లో పాల్గొంది. నగ్నంగా నటించింది. ఒక్కసారిగా తృప్తి దిమ్రి ఎవరనే చర్చ మొదలైంది. మీడియా సంస్థలు ఆమె ఇంటర్వ్యూ కోసం ఎగబడ్డాయి.
అంతగా ఆమెకు యానిమల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. యానిమల్ మూవీలో తృప్తి దిమ్రి విలన్ పంపిన గూఢచారిగా రన్బీర్ కపూర్ వద్దకు వస్తుంది. అతని నుండి సమాచారం సేకరించాలి అనుకుంటుంది. ఈ విషయం ముందే పసిగట్టిన హీరో… ఆమెను తన మోజులో పడేలా చేసి… ఆమె నుండి మేటర్ లాగుతాడు. యానిమల్ మూవీలో తృప్తి దిమ్రి పాత్ర అది. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా.. శృంగార సన్నివేశాల్లో నటించడంతో ప్రముఖంగా చెప్పుకున్నారు. యానిమల్ మూవీలో నటించడం పై పలు ఇంటర్వ్యూలలో తృప్తి దిమ్రి తన అభిప్రాయం తెలియజేసింది.
బోల్డ్ ఇమేజ్ సొంతం చేసుకున్న తృప్తి దిమ్రి… దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తుంది. గ్లామరస్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంది. తృప్తి దిమ్రి లేటెస్ట్ ఫోటో షూట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది. నెటిజెన్స్ గుండెల్లో గుబులు రేపేలా ఉంది. స్కిన్ షోలో నెక్స్ట్ లెవెల్ అన్నట్లున్న తృప్తి దిమ్రి ఫోటోలు చూసి జనాలు కామెంట్స్ చేయకుండా ఉండలేకున్నారు. ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
#TriptiDimri pic.twitter.com/dWo9m3t3sV
— Only Heroines (@OnlyHeroines) February 24, 2024