Anchor Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లిగారు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, సన్నిహితులకు తెలియజేశారు. తల్లి మరణం నేపథ్యంలో విష్ణుప్రియ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు ఓ ఎమోషన్ పోస్ట్ చేశారు. మై డియర్ మదర్… ఇన్నాళ్లు నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. నీతో గడిపిన ప్రతి క్షణాన్ని నేను గుర్తు చేసుకుంటాను. ఇకపై నీవు నా వెంటే ఉంటావు. నా ప్రతి శ్వాసలో ఉంటావు. నీతో గడిపిన క్షణాలు నేను మర్చిపోను. నా ఉన్నతి కోసం నీవు ఎన్నో తాగ్యాలు చేశావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఇకపై నీ ముద్దులు నేను మిస్ అవుతాను, అని విష్ణుప్రియ కామెంట్ చేశారు.

విష్ణుప్రియ ఎమోషనల్ నోట్ అభిమానులను కలచివేస్తుంది. ఆమెకు పలువురు ధైర్యం చెబుతున్నారు. ఆమె తల్లిగారి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే విష్ణుప్రియ డియర్ ఫ్రెండ్ రీతూ చౌదరి తండ్రి మరణించారు. రోజుల వ్యవధిలో మిత్రుల జీవితాల్లో విషాదం చోటుచేసుకోవడం ఊహించని పరిణామం. విష్ణుప్రియ, రీతూ చౌదరి వెకేషన్ కోసం థాయిలాండ్ వెళ్లారు. తమ వెకేషన్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో చేయగా వైరల్ అయ్యాయి.
విష్ణుప్రియ యూట్యూబర్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆమె అనేక షార్ట్ ఫిల్మ్స్ , కామెడీ వీడియోల్లో నటించారు. యాంకర్ గా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో విష్ణుప్రియకు పోవే పోరా షోలో ఛాన్స్ వచ్చింది. సుడిగాలి సుధీర్ తో పాటు పోవే పోరా షో యాంకర్ గా విష్ణుప్రియ చేశారు. సదరు యూత్ ఫుల్ షో చెప్పుకోదగ్గ గుర్తింపు తెచ్చుకుంది. ఆ విధంగా విష్ణుప్రియ ఫేమ్ రాబట్టారు.

విష్ణుప్రియకు వెండితెర ఆఫర్స్ కూడా రావడం విశేషం. కె రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఓ రోల్ చేశారు. సునీల్, అనసూయ, వెన్నెల కిషోర్, దీపికా పిల్లి వంటి నటులు వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో నటించారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.