Anchor Varshini: యాంకర్ వర్షిణి పెళ్లి ఫిక్స్.. వరుడు ఎవరో తెలిస్తే తట్టుకోలేరు!

Anchor Varshini: బుల్లితెరపై హాట్ రోమాంటిక్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది వర్షిణి. అనసూయ, రష్మి తర్వాత అంతటి అందం చందం బబ్లీనెస్ వర్షిణి సొంతం. ముద్దుముద్దు మాటలతో అందమైన నవ్వుతో యువతకు నిద్ర లేకుండా చేసే ఈ యాంకర్ ఇటీవల సోషల్ మీడియాలో తన అందాలన్నీ ఆరబోస్తూ హీట్ పెంచుతోంది. ఇటు టీవీ రియాలిటీ షోలతోనూ. అటు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా టీవీ ఇండస్ట్రీలోకి వచ్చిన వర్షిణికి ఇప్పుడు తెలుగు నాట […]

Written By: NARESH, Updated On : October 2, 2022 11:47 am
Follow us on

Anchor Varshini: బుల్లితెరపై హాట్ రోమాంటిక్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది వర్షిణి. అనసూయ, రష్మి తర్వాత అంతటి అందం చందం బబ్లీనెస్ వర్షిణి సొంతం. ముద్దుముద్దు మాటలతో అందమైన నవ్వుతో యువతకు నిద్ర లేకుండా చేసే ఈ యాంకర్ ఇటీవల సోషల్ మీడియాలో తన అందాలన్నీ ఆరబోస్తూ హీట్ పెంచుతోంది. ఇటు టీవీ రియాలిటీ షోలతోనూ. అటు వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా టీవీ ఇండస్ట్రీలోకి వచ్చిన వర్షిణికి ఇప్పుడు తెలుగు నాట విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

బుల్లితెరపై హాట్ యాంకర్ గా కొనసాగుతున్న యాంకర్ వర్షిణి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని సమాచారం. చాలా రోజులుగా పెళ్లి ఎప్పుడు అన్న వారికి షాకిస్తూ ఎంగేజ్ మెంట్ కు రెడీ అయిపోయిందట.. ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోయేది మరెవరినో కాదు తన సొంత బావనే అని సమాచారం. ఈ మేరకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారని.. వర్షిణి కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

చిన్నప్పటి నుంచి మేన బావ అంటే వర్షిణికి ఇష్టమట.. బావ కూడా వర్షిణి అంటే ప్రాణం పెడుతాడట.. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పెద్దలు సంబంధం ఓకే చేశారని సమాచారం. వర్షిణి బుల్లితెర, సినిమాలు, వెబ్ సిరీస్ ల కారణంగా ఇన్నాళ్లు ఆగారని ఇప్పుడు పెళ్లి ఫిక్స్ చేశారని తెలిసింది.

చాలా పెద్ద సంబంధాలు వచ్చినా కూడా తనకు తెలిసిన బావనే పెళ్లి చేసుకోవడానికి యాంకర్ వర్షిని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిసింది. అతడు ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అని.. ఒక్కడే కొడుకు.. బాగా ఆస్తి ఉన్న కోటీశ్వరుడు అని సమాచారం.

త్వరలోనే తన బావతో వర్షిణి ఎంగేజ్ మెంట్ కూడా ఈ నెలాఖరు వరకూ ఉండనుందని సమాచారం. వచ్చే ఏడాది మార్చిలోనే వీరిద్దరికీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద బుల్లితెరపై యాంకర్ వర్షిణి పెళ్లి పీటలెక్కబోతోందన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా అప్పట్లో హైపర్ ఆదితో ఈ భామ రోమాన్స్ చేసిందని.. అతడితో సాన్నిహిత్యంగా ఉండి డేటింగ్ చేసినట్టు వార్తలు వచ్చాయి. వారిద్దరి ఫొటోలు వైరల్ అయ్యాయి. ఏమైందో కానీ ఇప్పుడు హైపర్ ఆదితో బ్రేకప్ పడిపోయిందని.. కొత్తగా తన భావను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసింది.