Anchor Rashmi Gautam : యాంకర్ రష్మీ గౌతమ్ కి వేధింపులు ఎక్కువయ్యాయి. ఒకరు ఏకంగా ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డారు. సదరు సందేశం సోషల్ మీడియాలో షేర్ చేసిన రష్మీ నేను కంప్లైంట్ చేయవచ్చా? అని ప్రశ్నించారు. రష్మీ తన ట్వీట్లో… ‘ఈ వ్యక్తి గతంలో నా వయసు, పెళ్లి గురించి అభ్యంతరకర సందేశాలు పంపారు. ఇప్పుడు ఏకంగా నాకు చేతబడి చేయిస్తా, యాసిడ్ దాడి చేస్తా అంటున్నారు. నేను ఈ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చా?’ అని నెటిజన్స్ ని అడిగారు. అలాగే బెదిరిస్తున్న వ్యక్తి సందేశాన్ని స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు.
రష్మీకి వచ్చిన సందేశం పరిశీలిస్తే… ‘నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి ***. నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో కూర్చో. ఆవుల వలన ప్రమాదాలు జరుగుతున్నాయా. యాసిడ్ పోస్తా వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకు తెలియదు మూసుకొని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావ్’ అని ఉంది. చేతబడి చేస్తా, యాసిడ్ పోస్తా అని బెదిరింపులకు దిగిన నేపథ్యంలో రష్మీ గౌతమ్ ఆ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఆ వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చా? అని నెటిజెన్స్ ని అడిగారు. పలువురు కేసు పెట్టండని సలహా ఇస్తున్నారు.
ఇలానే ఓ వ్యక్తి రష్మీని కుక్కని కొట్టినట్లు కొట్టాలంటూ ఆమెను ట్యాగ్ చేసి సందేశం పోస్ట్ చేశారు. ఆ కామెంట్ కి సీరియస్ అయిన రష్మీ… రిప్లై ఇచ్చారు. టైం, ప్లేస్ చెప్పు. నేనే అక్కడకు వస్తా. ఏం చేస్తావో చూస్తా అంటూ మరో అతనికి ఛాలెంజ్ విసిరింది. ఇదంతా ఆమె పెట్ లవర్ కావడం వలనే వచ్చింది. హైదరాబాద్ లో నాలుగేళ్ల బాలుడిని వీధి కుక్కలు దాడి చేసి ప్రాణాలు తీశాయి. దీంతో ప్రజలు యానిమల్ లవర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్మీ వంటి యానిమల్ లవర్స్ కేసులు వేసి అధికారులు వీధి కుక్కలను నియంత్రించకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు.
అయితే తన సిద్ధాంతానికి రష్మీ కట్టుబడి ఉన్నారు. ఎవరెంతగా విమర్శించినా మూగజీవాలను హింసించే హక్కు మనుషులకు లేదని బల్లగుద్ది చెబుతున్నారు. తనపై వచ్చే సోషల్ మీడియా ట్రోల్స్ ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత మూడు రోజులుగా రష్మీని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు ఏకంగా బెదిరింపులకు దిగుతున్నారు. ఇప్పటివరకు అనసూయ ఈ తరహా వేధింపులు ఎదుర్కుంటున్నారు. తాజా ఘటనతో రష్మీ ఆమెను మించిపోయారు. ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.
This acc sometime back had a problem with my age nd marriage now he /she wants to do black magic on me and pour acid on me
Shud I be filing a complaint now ??? pic.twitter.com/a6SaQO6Tu4— rashmi gautam (@rashmigautam27) February 25, 2023