Anchor Anasuya Bharadwaj: అనసూయ మరోసారి తల్లయ్యింది. ఆమె గర్భం దాల్చారు. అనసూయ ఈ వయసులో అమ్మ కావడం ఏమిటని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. అసలు విషయం ఏమిటంటే… అనసూయ లేటెస్ట్ మూవీ రంగమార్తాండ. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్నారు. మరాఠీ చిత్రం నటసామ్రాట్ రీమేక్ గా తెరకెక్కుతుంది. చాలా రోజులుగా మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. త్వరలో విడుదల చేయనున్నారని సమాచారం. ప్రమోషన్స్ సైతం షురూ చేశారు.మెగాస్టార్ చిరంజీవి సహకారం తీసుకున్నారు కృష్ణవంశీ. ఆయన వాయిస్ ఓవర్ అందిస్తున్నట్లు తెలుస్తుంది.

రంగమార్తాండ చిత్రంలో ప్రకాష్ రాజ్-రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు చేస్తున్నారు . బ్రహ్మానందం ఓ కీలక రోల్ చేస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్, అనసూయలు కూడా నటిస్తున్నారు. రంగమార్తాండ వర్కింగ్ స్టిల్ ఒకటి అనసూయ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. సదరు ఫోటోలో పెళ్లి కూతురిగా శివాత్మిక కూర్చుని ఉన్నారు. శివాత్మిక తల్లిదండ్రులైన ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ ఆమెతో పాటు పెళ్లిపందిరిలో పక్కన ఉన్నారు. సదరు ఫ్రేమ్ లో అనసూయ కూడా ఉంది. అనసూయ లుక్ చూస్తే అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అనసూయ రంగమార్తాండ చిత్రంలో ప్రెగ్నెంట్ ఉమన్ గా నటిస్తున్నారని క్లియర్ గా తెలుస్తుంది. అనసూయ షేర్ చేసిన వర్కింగ్ స్టైల్ లో ఆమె గర్భంతో కనిపించారు. ఈ క్రమంలో అనసూయ పాత్రపై ఆసక్తి పెరిగింది. నిజానికి అనసూయ రంగమార్తాండ మూవీలో దేవదాసి రోల్ చేస్తున్నారనే ప్రచారం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఫోటో దేవదాసి అనే వాదనను ఖండించేదిగా ఉంది. ప్రకాష్ రాజ్ ఫ్యామిలీ మెంబర్ లేదా మరో కూతురు రోల్ అనసూయ చేస్తున్నారేమో అనిపిస్తుంది.

సో… రంగమార్తాండ మూవీలో అనసూయ తల్లి అయ్యారన్న మాట. వాస్తవంలో కాదు. గతంలో థాంక్ యూ బ్రదర్ మూవీలో అనసూయ ప్రెగ్నెంట్ లేడీ రోల్ చేశారు. రంగమార్తాండ చిత్రంలో మరోసారి ఈ ఛాలెంజింగ్ రోల్ ట్రై చేశారు. కాగా అనసూయ లేటెస్ట్ మూవీ మైఖేల్ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 3న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సందీప్ కిషన్ హీరోగా నటించిన మైఖేల్ మూవీ క్రైమ్ డ్రామాగా తెరకెక్కింది.
విజయ్ సేతుపతి మరో ప్రధాన పాత్ర చేస్తున్నారు. దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. అలాగే పుష్ప 2 సెట్స్ పై ఉంది. లేటెస్ట్ షెడ్యూల్ కోసం ఇటీవల పుష్ప 2 టీమ్ వైజాగ్ వెళ్లారు. ఈ చిత్రంలో అనసూయ దాక్షాయణిగా లేడీ విలన్ రోల్ చేస్తున్నారు. నటిగా బిజీ అయిన అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు.