Anasuya Bharadwaj: అనసూయ లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతుంది. ఆమె బెడ్ పై పడుకున్న ఫోటో షేర్ చేయడమే దీనికి కారణం. కొంచెం చర్చకు తెర లేపేలా ఉన్న అనసూయ ఫోటోపై నెటిజెన్స్ దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అనసూయపై ఎక్కడలేని నెగిటివిటీ నడుస్తుంది. ఆమె ఏం మాట్లాడినా, ఎలాంటి పోస్ట్ పెట్టిన ట్రోల్ చేయడానికి ఒక వర్గం సిద్ధంగా ఉంటారు. అనవసర వివాదాల్లో ఆమె ఏలు పెట్టడం కూడా దీనికి ఒక కారణం.
గొప్ప ఫెమినిస్ట్ గా చెప్పుకునే అనసూయ తనకు సంబంధం లేని గొడవల్లో తలదూర్చుతారు. లైగర్ వివాదం అలాంటిదే. ఎప్పుడో 2017 లో జరిగిన సంఘటన తెరపైకి తెచ్చి లైగర్ వివాదం రగిల్చింది. హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీలో అమ్మను కించపరిచేలా ఒక బూతు పదం వాడాడు. దానిపై అనసూయ అభ్యంతరం తెలిపింది. టీవీ డిబేట్లలో పాల్గొని తన వాదన వినిపించింది. సినిమాలో అలాంటి బూతులు వాడటం తప్పన్న అభిప్రాయం వెల్లడించింది. అనసూయకు కొందరు మద్దతు తెలిపారు. అంతటితో ఆ గొడవ ముగిసింది.
ఈ ఏడాది ఆగస్టు లో లైగర్ మూవీ విడుదలైంది. ఆ మూవీ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. వెంటనే అనసూయ రియాక్ట్ అయ్యారు. అర్జున్ రెడ్డి వివాదాన్ని తెరపైకి తెస్తూ పరోక్షంగా లైగర్ చిత్ర ఫలితం అమ్మను తిట్టిన పాపమే అన్నట్లు ట్వీట్ చేసింది. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అనసూయను ఆంటీ అని ట్రోల్ చేశారు. రోజుల తరబడి ఆ వివాదం నడిచింది. కొందరిపై అనసూయ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు.
లైగర్ వివాదం నాటి నుండి ఆమెపై సోషల్ మీడియా ట్రోలింగ్ ఎక్కువైంది. తాజాగా అనసూయ బెడ్ పై పడుకొని నిద్రిస్తున్నట్లున్న ఫోటో షేర్ చేశారు. దానికి కామెంట్ గా… నిద్రపోతూ ఉండండి. అలాగే మీ కలలను నిజం చేసుకోండి, అని పెట్టారు. అనసూయ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొందరు పచ్చి బూతులు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఆ బూతులు తిట్టేవాళ్ళు మాత్రం అలర్ట్ గా ఉండాలి. ఇటీవలే ఒక వ్యక్తిపై ఫిర్యాదు చేసి అనసూయ అరెస్ట్ చేయించారు.