https://oktelugu.com/

Mahesh Babu New Look: ఫ్యాన్స్ కలలో కూడా ఊహించని లుక్… గుబురు గడ్డంలో హాలీవుడ్ యాక్షన్ హీరోని తలపిస్తున్న మహేష్!

Mahesh Babu New Look: మహేష్ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు. కెరీర్ బిగినింగ్ నుండి ఆయనకు అవి కలిసి రాలేదు. నాని, నిజం, స్పైడర్ వంటి చిత్రాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. అభిమానులు కోరుకున్నట్లు పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేయడమే బెటర్ అని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో మహేష్ తన లుక్ కూడా పెద్దగా మార్చరు. మాస్ రోల్స్ లో కూడా గడ్డం, మీసంతో కనిపించిన సందర్భం లేదు. భరత్ అనే నేను మూవీలో […]

Written By:
  • Shiva
  • , Updated On : November 24, 2022 / 09:23 AM IST
    Follow us on

    Mahesh Babu New Look: మహేష్ ప్రయోగాలు చేయడానికి ఇష్టపడరు. కెరీర్ బిగినింగ్ నుండి ఆయనకు అవి కలిసి రాలేదు. నాని, నిజం, స్పైడర్ వంటి చిత్రాలు చేదు అనుభవాలను మిగిల్చాయి. అభిమానులు కోరుకున్నట్లు పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేయడమే బెటర్ అని ఫిక్స్ అయ్యారు. అదే సమయంలో మహేష్ తన లుక్ కూడా పెద్దగా మార్చరు. మాస్ రోల్స్ లో కూడా గడ్డం, మీసంతో కనిపించిన సందర్భం లేదు. భరత్ అనే నేను మూవీలో మహేష్ ఒక పాటలో మీసంతో కనిపించారు. ఆయన అచ్చు కృష్ణలా అనిపించారు. ఇక గడ్డం పెంచడం అంటే సరే సరి. టక్కరి దొంగతో పాటు కొన్ని సినిమాల్లో మహేష్ లైట్ గడ్డం ట్రై చేశారు.

    Mahesh Babu New Look

    రెండు దశాబ్దాల కెరీర్లో మహేష్ గుబురు గడ్డంతో నటించలేదు. తాజాగా ఆయన నిండు గడ్డంలో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ లుక్ సరికొత్తగా ఉంది. మాస్ లుక్ లో మహేష్ హాలీవుడ్ యాక్షన్ హీరో కీను రీవ్స్ ని తలపించాడు. జాన్ విక్ మూవీలో కీను రీవ్స్ లుక్ ఇలానే ఉంటుంది. లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ కి నచ్చేయగా వైరల్ చేస్తున్నారు. త్రివిక్రమ్ మూవీ కోసం ఈ లుక్ ట్రై చేస్తున్నారా? అనే సందేహాలు వెలువరిస్తున్నారు.

    కాగా నవంబర్ 15న మహేష్ తండ్రి కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మహేష్ ఆయన మరణాంతర కార్యక్రమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. కృష్ణ అస్థికలు విజయవాడ కృష్ణానదిలో కలిపారు. ఇంకా దశదిన కర్మ నిర్వహించాల్సి ఉంది. సంస్మరణ సభ ఏర్పాటు చేసి అభిమానులను మహేష్ కలవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో త్రివిక్రమ్ తో చేస్తున్న మూవీ నెక్స్ట్ షెడ్యూల్ కి మరికొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.

    Mahesh Babu New Look

    మరోవైపు SSMB 28 స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడిగా థమన్ ని తప్పించారని అంటున్నారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ పూర్తి కాగా ఈ రిపేర్లు ఏంటని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఇక మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చేస్తున్న ప్రాజెక్ట్ రాజమౌళి చిత్రం. తన గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో రాజమౌళి మహేష్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడు కథగా మహేష్ మూవీ ఉంటుందని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. స్క్రిప్ట్ పూర్తి కాగా… ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి.

    Tags