Naga Shaurya Health: యూత్ ని ఆకట్టుకునే కథాంశాలతో సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో నాగ శౌర్య..రీసెంట్ గా కృష్ణ వృందా విహారి సినిమా తో సూపర్ హిట్ ని తన ఖాతా లో వేసుకున్న ఈ యువ హీరో ప్రస్తుతం ‘నారి నారి నడుమ మురారి’ అనే సినిమా నటిస్తున్నాడు..ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది..అయితే ఈరోజు షూటింగ్ స్పాట్ లో నాగ శౌర్య డీ హైడ్రాషన్ కారణం గా స్పాట్ లోనే కుప్పకూలి పడిపోయాడు.

ఒక యాక్షన్ సన్నివేశం కోసం ఆయన గత మూడు రోజుల నుండి నీళ్లు లేకుండా తన యాబ్స్ ని చూపించడం కొరకు వర్కౌట్స్ చేసాడు..అందువల్ల డీ హైడ్రేషన్ ఏర్పడి లొకేషన్ లోనే కుప్పకూలిపోయాడు..దీనితో ఆయనని వెంటనే గచ్చిబౌలి సమీపం లో హాస్పిటల్ లో చేర్చారు..ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు సమాచారం..హాస్పిటల్ నుండి కొద్దిసేపటి క్రితమే డిశ్చార్జ్ కూడా అయిపోయాడట.
ఇక నాగశౌర్య అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే..బెంగళూరు కి చెందిన అనూష శెట్టి అనే అమ్మాయిని ఆయన ఈ నెల 20 వ తారీఖున పెళ్లాడబోతున్నారు..అనూష శెట్టి బెంగళూరు లో ఒక పాపులర్ ఇంటీరియర్ డిజైనర్..నాగ శౌర్య పెళ్లి గురించి చాలా కాలం నుండి సోషల్ మీడియా లో రూమర్స్ ప్రచారమవుతూనే ఉన్నాయి..ఒక టాప్ హీరోయిన్ తో ఆయన చాలా కాలం నుండి డేటింగ్ లో ఉన్నట్టు కూడా వార్తలు వచ్చాయి..కానీ ఆయన చివరికి పెద్దలు కుదిరించిన పెళ్లిని చేసుకుంటున్నాడు.

ఇక నాగ శౌర్య ప్రస్తుతం ‘నారి నారి నడుమ మురారి’ సినిమాతో పాటుగా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ , ‘పోలీస్ వారి హెచ్చరిక’ వంటి సినిమాలు చేస్తున్నాడు..నిన్నగాక మొన్న ఇండస్ట్రీ కి వాచినట్టు అనిపిస్తున్న ఈ యువ హీరో అప్పుడే 24 సినిమాలు చేసేసాడు..వీటిల్లో కేవలం మూడు , నాలుగు హిట్స్ తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్స్ గా నిలిచాయి..కెరీర్ ని మలుపు తిప్పే హిట్లు ఇప్పటి వరుకు పడలేదు..పెళ్లి తర్వాతైనా అతని జాతకం మారి పెద్ద హిట్ కొడుతాడో లేదో చూడాలి.