
Amigos Collections: నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా నటించిన ‘అమిగోస్’ చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ గా నిల్చింది.హిట్టు మీద హిట్టు కొడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న నందమూరి ఫ్యామిలీ సినిమాలకు మరింత ఊపుని ఈ సినిమా రప్పిస్తుంది అని అనుకుంటే, ఆ ఫ్యామిలీ సక్సెస్ స్త్రీక్ కి బ్రేక్ వేసింది. కొత్త తరహా కథని ఎంచుకున్నప్పటికీ హైపర్ క్రియేట్ చెయ్యడం లో టీజర్స్ మరియు ట్రైలర్స్ విఫలం అవ్వడం తో ఓపెనింగ్స్ దగ్గర నుండి క్లోసింగ్ వరకు ఈ సినిమా నిరాశ పరుస్తూనే ఉంది.
ఇప్పటివరకు ఈ సినిమా విడుదలై వారం రోజులు అయ్యింది. ఈ వారం రోజులకు ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ స్టేటస్ కి చేరాలంటే ఇంకా ఎంత వసూళ్లను రాబట్టాలి అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.
సినిమా ఎలా ఉన్న నందమూరి కుటుంబ హీరోలకు రాయలసీమ ప్రాంతం లో మంచి వసూళ్లు వస్తాయి.. కానీ అమిగోస్ చిత్రానికి అక్కడ కూడా దారుణమైన వసూళ్ళే వచ్చాయి. ఆ ప్రాంతం మొత్తానికి కలిపి వారం రోజులకు గాను కనీసం కోటి రూపాయిలు కూడా రాకపోవడం గమనార్హం. కానీ రాయలసీమ తో పోలిస్తే తెలంగాణ లో ఈ చిత్రానికి కాస్త డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయనే చెప్పాలి. అక్కడ ఈ చిత్రానికి కోటి 50 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి.

అలాగే ఉత్తరాంధ్ర లో 68 లక్షలు,ఈస్ట్ లో 46 లక్షలు,వెస్ట్ లో 28 లక్షలు, గుంటూరు లో 60 లక్షలు, కృష్ణ లో 42 లక్షలు మరియు నెల్లూరు లో 27 లక్షల రూపాయిలను వసూలు చేసింది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కలిపి ఈ సినిమాకి 5 కోట్ల 12 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది కాకుండా ఓవర్సీస్ లో 70 లక్షలు మరియు కర్ణాటక లో 32 లక్షలు వసూలు చేసింది. మొత్తం మీద 15 కోట్ల రూపాయిల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి 6 కోట్ల 15 లక్షలు మాత్రమే వసూలు చేసింది. ఇంకా దాదాపుగా 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సిన అవసరం ఉంది.. కానీ అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి. సంక్రాంతి కి ‘వాళ్తేరు వీరయ్య’,’వీర సింహా రెడ్డి’ వంటి సూపర్ హిట్ సినిమాలు విడుదల చేసి మంచి సక్సెస్ ఊపులో ఉన్న మైత్రి మూవీ మేకర్స్ జైత్రయాత్ర కి అడ్డుకట్ట వేసింది ఈ చిత్రం.. నిన్నటి నుండి ఈ చిత్రానికి అన్నీ ప్రాంతాలకో షేర్స్ కూడా రావడం ఆగిపోయిందట.