Jayalalitha Shoban Babu Daughter: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత, శోభన్ బాబుల గురించి ఇప్పటికీ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. గతంలో చాలామంది జయలలిత అసలు వారసులం తామే అంటూ రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇదే కోవలో మరో మహిళ తెరమీదకు వచ్చింది. తానే జయలలిత, శోభన్ బాబు వారసురాలిని అంటూ మీడియాకు ఎక్కింది.
మధురై తహసీల్దార్ ఆఫీస్ లో మురుగేషన్ భార్య మీనాక్షి ఈ తరహా అర్జీ పెట్టుకుంది. తన తల్లి జయలలిత అని, తండ్రి శోభన్ బాబు అని వారు చనిపోయినందున తనకు వారసత్వ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ కోరింది. ఆమె అప్లికేషన్ చూసి ఆఫీసర్లు నోరెళ్లబెట్టారు. ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. నెల రోజుల తర్వాత ఆమె మళ్లీ ఆఫీస్ కి రావడంతో కొంత ఆందోళన చెందారు.
Also Read: ఆర్ఆర్ఆర్ లో ఊహకు అందని సర్ ప్రైస్ పెట్టిన జక్కన్న.. మరో లెవల్ లో ఉంటుందట
దీంతో అక్కడ ఉన్న డిప్యూటీ తహసీల్దార్ స్పందిస్తూ.. జయలలిత చనిపోయింది చెన్నైలో కాబట్టి అక్కడికి వెళ్లి అర్జీ పెట్టుకోమని తెలిపారు. కానీ అందుకు మీనాక్షి ఒప్పుకోలేదు. జయలలిత, శోభన్ బాబులు తనను అనాథగా వదిలి వెళ్లారని, తాను ఇప్పుడు పలనిలో ఉంటున్నట్లు తెలిపింది. పళని లో తనకు రథం లాగే హక్కును శోభన్ బాబు ఇచ్చారని కూడా చెప్పడం ఇక్కడ సంచలనం రేపుతోంది.
రథం లాగడానికి సంబంధించిన పత్రాలు కూడా తాను పొందానని.. అలాంటప్పుడు వారసత్వ పత్రాలు ఎందుకు ఇవ్వరని నిలదీసింది. డిప్యూటీ తహసీల్దార్ తో కొంతసేపు ఆమె వాగ్వాదానికి కూడా దిగింది. దీంతో ఆమెకు ఏం చెప్పాలో అర్థం కాక కార్యాలయ సిబ్బంది కొంతసేపు మౌనంగా ఉండి పోయారు. చివరకు మళ్లీ డిప్యూటీ తహసీల్దార్ స్పందిస్తూ ఆమెకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే కోర్టుకు వెళ్లి వాటిని చూపించి వారసత్వ పత్రాలు పొందాలంటూ మీనాక్షికి వివరించాడు. కాగా ఇదే విషయంపై మీనాక్షి మీడియాతో మాట్లాడింది. తానే జయలలితకు అసలైన వారసురాలిని అంటూ చెప్పుకొచ్చింది. ఇక కోర్టుకు వెళ్లే విషయంపై న్యాయవాదితో మాట్లాడతానని, ఈ విషయంలో మాత్రం ఎవరి మాట వినను అంటూ తేల్చి చెప్పింది. మరి ఆమె చెబుతున్న మాటలు ఎంత వరకు నిజమో అనేది మాత్రం తెలియాల్సి ఉంది. గతంలో ఇద్దరు ముగ్గురు కూడా ఇలాగే చేసిన సంగతి ఎంత హల్చల్ చేసిందో తెలిసిందే.
Also Read: మందు బాబులకు షాక్.. రెండు రోజులు వైన్స్ బంద్