https://oktelugu.com/

Allu Arjun Navadeep: బన్నీ సర్‌ప్రైజ్‌ : హీరో నవదీప్‌కు సూపర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌..

Allu Arjun Navadeep: ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి స్నేహం బంధం ఉంది. అందులో కొందరు మాత్రం స్టార్‌ ఇమేజ్‌ తో సంబంధం లేకుండా బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉంటారు. అటువంటి వారిలో అల్లు అర్జున్‌. నవదీప్‌ కూడా ఉన్నారు. రీసెంట్‌గా నవదీప్‌ కోసం కాస్ట్లీ గిఫ్ట్‌ పంపించాడు బన్నీ. ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ఫ్రెండ్‌ షిప్‌ చేసేవారు చాలా మంది ఉన్నారు. అందులో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, నవదీప్‌ కూడా ఉన్నారు. జై […]

Written By:
  • NARESH
  • , Updated On : May 14, 2022 / 02:51 PM IST
    Follow us on

    Allu Arjun Navadeep: ఫిల్మ్‌ ఇండస్ట్రీలో హీరోల మధ్య మంచి స్నేహం బంధం ఉంది. అందులో కొందరు మాత్రం స్టార్‌ ఇమేజ్‌ తో సంబంధం లేకుండా బెస్ట్‌ ఫ్రెండ్స్‌గా ఉంటారు. అటువంటి వారిలో అల్లు అర్జున్‌. నవదీప్‌ కూడా ఉన్నారు. రీసెంట్‌గా నవదీప్‌ కోసం కాస్ట్లీ గిఫ్ట్‌ పంపించాడు బన్నీ.

    Allu Arjun Navadeep

    ఇండస్ట్రీలో స్టార్‌డమ్‌తో సంబంధం లేకుండా ఫ్రెండ్‌ షిప్‌ చేసేవారు చాలా మంది ఉన్నారు. అందులో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, నవదీప్‌ కూడా ఉన్నారు. జై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. చందమామ, ఆర్య–2 సెకండ్‌ మెయిన్‌ లీడ్స్‌ లో నటించి.. మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు నవదీప్‌. అయితే ఇండస్ట్రీలో నవదీప్‌కు ఉన్న బెస్ట్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా ఉన్నారు.

    Also Read: Mahesh Babu Hard work: మహేష్ కష్టమంతా వృధా.. ఇది ఫ్యాన్స్ కి వ్యథే !

    -ఖరీదైన ఎయిర్ పొడ్స్ బహుమతి..
    ఈ యంగ్‌ స్టార్‌కు ఆ స్టార్‌ హీరో ఖరీదైన కానుక అందించాడు. ఆ ప్రత్యేక కానుకను ఇన్ స్ట్రాగామ్‌ హ్యాండిల్‌లో షేర్‌ చేస్తూ..తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు నవదీప్‌. అల్లు అర్జున్ తాజాగా స్వయంగా కొని నవదీప్‌కు చాలా ఖరీదైన ఎయిర్‌పొడ్స్‌ కానుకగా పంపించాడు. తన స్నేహ బంధాన్ని మరోసారి చాటుకున్నారు అల్లు అర్జున్‌. సుకుమార్‌ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య–2 సినిమాలో అల్లు అర్జున్ –నవదీప్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా నటించారు. ఈ క్రేజీ సినిమాలో బన్నీ–నవదీప్‌ మధ్య సన్నివేశాలు వారి స్నేహానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఆర్య–2తో నవదీప్‌–అల్లు అర్జున్‌ మధ్య స్నేహబంధం మరింత పెరిగింది. అల్లు అర్జున్‌ తనకు ప్రేమతో పంపిన ఆ గిప్ట్‌ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు నవదీప్‌. అంతే కాదు బన్నీని ఉద్దేశించి చిన్న నోట్‌ కూడా రాశాడు. ‘ప్రేమకు హద్దులు లేకుంటే.. ఒకేషన్‌ ఏమీ లేకున్నా సందర్భానుసారంగా కాకుండా బహుమతులు వస్తే. ధన్యవాదాలు అర్జున్‌ బావ్స్‌. ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్‌ వాడతా’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు నవదీప్‌.

    +కొత్త సినిమాల్లో ఇద్దరూ బిజీ..
    నవదీప్‌ నెక్ట్స్‌ అవనీంద్ర డైరెక్ట్‌ చేస్తున్న లవ్‌ మౌలీ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది ఈ మూవీ. అటు అల్లు అర్జున్‌ కూడా పుష్ప సక్సెస్‌తో దిల్‌ ఖుష్‌గా ఉన్నాడు. పుష్ప–2 కోసం లైన్‌ సెట్‌ చేసే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్‌.

    Also Read: Sarkari Vaari Paata Prabhas: సర్కార్‌వారి పాట సినిమా చూసిన ప్రభాస్‌.. మహేశ్‌ నటనపై సంచలన వ్యాఖ్యలు!!

    Tags