Allu Arjun- Sukumar: 18 పేజెస్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక సాక్షిగా పుష్ప డైరెక్టర్ సుకుమార్ ని అల్లు అర్జున్ బ్లాక్ మెయిల్ చేశాడు. అవన్నీ ఇప్పుడే చెప్పేస్తాను అంటూ షాక్ ఇచ్చాడు. పుష్ప 2 అప్డేట్ ఇవ్వకపోవడంతో అల్లు అర్జున్ ఈ కామెంట్స్ చేశారు. నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ కాంబోలో 18 పేజెస్ టైటిల్ తో రొమాంటిక్ లవ్ అండ్ థ్రిల్లర్ తెరకెక్కింది. ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 18 పేజెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

18 పేజెస్ మూవీ నాకు కెరీర్ ఇచ్చిన సుకుమార్ శిష్యుడు దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అలాగే సుకుమార్ నిర్మాతగా కూడా ఉన్నారు. నా ఆప్తుడు బన్నీ వాసు నిర్మించాడు. ఈ కారణంతోనే పిలవగానే ఈవెంట్ కి వచ్చాను, అన్నారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ లపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. 18 పేజెస్ చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెష్ తెలియజేశారు. మూవీ కచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.
కాగా సుకుమార్ ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ చేసిన కొన్ని కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అందరూ పుష్ప అప్డేట్ అడుగుతున్నారు. మరి అప్డేట్ రావడం లేదు. ఆయన నిర్మాతగా ఉన్న మూవీ 18 పేజెస్ అయితే దర్శకుడిగా ఉన్న మూవీ 118 పేజెస్ అవుతుంది. త్వరలో పుష్ప 2 అప్డేట్ వస్తుంది. లేదంటే నేను షూటింగ్ లో చెబుతున్న డైలాగ్స్ మొత్తం బయటకు చెప్పేస్తాను, అని సుకుమార్ కి స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

సుకుమార్ నాకు చాలా క్లోజ్, నా వెల్ విషర్. నేను ఈ స్థాయికి రావడానికి ఆయన పాత్ర ఎంతో ఉంది. కాబట్టి పుష్ప 2 ఎంత లేట్ అయినా నేను ఏమీ అనుకోను. ఇక పుష్ప 2 ఎలా ఉంటుందంటే.. అసలు తగ్గేదెలే,అని అల్లు అర్జున్ అన్నారు. ఈ మాట నేను గర్వంతో చెప్పడం లేదు. సినిమాపై అంత నమ్మకం ఉంది. చాలా బాగుంటుందనే విశ్వాసంతో చెబుతున్నాను, అని అన్నారు. పుష్ప 2 అప్డేట్ విషయంలో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. పుష్ప పార్ట్ 1 విడుదలైన డిసెంబర్ 17కి ఏడాది పూర్తి అయ్యింది.