Allu Arha : శాకుంతలం చిత్రం గురించి ఓ షాకింగ్ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. అల్లు అర్హ చేసిన బాల భరతుడు పాత్ర ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ చేయాల్సిందట. మరి ఎందుకు చేయలేదు?. అల్లు అర్జున్ గారాలపట్టి అర్హ శాకుంతలం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆమె శకుంతల కొడుకైన భరతుడు పాత్ర చేసింది. చివర్లో వచ్చి మెరుపులు మెరిపించింది. అల్లు అర్హ నటనతో మెప్పించింది. పౌరాణిక డైలాగులు గొప్పగా చెప్పింది. అంచనాలకు మించి అల్లు అర్హ భరతుడు పాత్ర చేసింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆమె పెర్ఫార్మన్స్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుందని కొనియాడుతున్నారు. అయితే ఈ పాత్ర కోసం మొదట గుణశేఖర్ ఎన్టీఆర్ కొడుకును అనుకున్నారట. అబ్బాయి పాత్ర కాబట్టి ఓ స్టార్ హీరో కొడుకును పెట్టడం ప్లస్ అవుతుంది అనేది ఆయన ఆలోచనట. అందుకు ఎన్టీఆర్ పెద్ద కుమారుడైన అభయ్ రామ్ బెస్ట్ ఛాయిస్ అనుకున్నాడట. వెంటనే ఎన్టీఆర్ ని సంప్రదించాడట. అయితే షాక్ ఇస్తూ ఆయన నో అన్నారట. అప్పుడే అభయ్ రామ్ ని సినిమాల్లోకి తీసుకొచ్చే ఆలోచన లేదంటూ… సున్నితంగా తిరస్కరించారట.
ఎన్టీఆర్ తో గుణశేఖర్ కి మంచి అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్టీఆర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. బాల రామాయణం మూవీలో జూనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ రాముడు రోల్ చేశారు. ఆ సినిమాకు జాతీయ అవార్డు వచ్చింది. ఈ పరిచయంతో ఎన్టీఆర్ ని గుణశేఖర్ రిక్వెస్ట్ చేశారు. కారణం తెలియదు కానీ ఎన్టీఆర్ ఆసక్తి చూపలేదు.
నిజానికి గుణశేఖర్ పరిచయం చేసిన ఎన్టీఆర్ కెరీర్లో ఊహించని స్థాయికి ఎదిగారు. అలాగే ఆయన ఫస్ట్ నటించిన పాత్ర బాల భరతుడే. ఎన్టీఆర్-బాలయ్యల కాంబోలో 1991లో బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రం చేశారు. ఆ మూవీలో ఎన్టీఆర్ బాల భరతుడు పాత్ర చేశారు. అయితే ఎన్టీఆర్ హిందీ వర్షన్ లో నటించారు. అది విడుదల కాలేదు. గుణశేఖర్ ఆఫర్ కి ఒప్పుకుని ఉంటే ఎన్టీఆర్ మాదిరి కొడుకు అభయ్ రామ్ కూడా మొదట నటించిన పాత్ర భరతుడు అయ్యేది. సెంటిమెంట్ కలిసొచ్చేది.