Allu Aravind: టాలీవుడ్ మొత్తం నలుగురి నిర్మాతల చేతిలో బందీ అయ్యిందని.. థియేటర్స్ అన్నీ వాళ్ళ ఆధ్వర్యంలోనే రన్ అవుతున్నాయని.. వాళ్ళ వల్లే చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతుందని ఎన్నో ఏళ్ళ నుండి కొన్ని వర్గాలు విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.. ముఖ్యంగా అల్లు అరవింద్ , దిల్ రాజు మరియు సురేష్ బాబు వంటి నిర్మాతలు ఇండస్ట్రీ ని శాసిస్తున్నారని..పెద్ద మాఫియా ని నడుపుతున్నారు అంటూ ఇప్పటికి విమర్శలు వస్తూనే ఉన్నాయి..దీనిపై అల్లు అరవింద్ తనదైన శైలిలో స్పందించారు.

ఇటీవలే ఆయన అన్ స్టాపబుల్ విత్ NBK షో లో పాల్గొన్నాడు.. ఆయనతో పాటుగా సురేష్ బాబు, రాఘవేంద్ర రావు మరియు కోదండరామి రెడ్డి వంటి వారు కూడా హాజరయ్యారు.. ఈ ఎపిసోడ్ లో బాలయ్య బాబు నిర్మాతలైన అల్లు అరవింద్ మరియు సురేష్ బాబు ని ఇబ్బందిలో పడేసే ప్రశ్నలెన్నో అడిగాడు..కానీ అల్లు అరవింద్ మాత్రం చాలా తెలివిగా సమాదానాలు చెప్పాడు..ముఖ్యంగా తమ పై వస్తున్న ఇలాంటి వ్యాఖ్యల పై అన్ స్టాపబుల్ షో ద్వారా ఒక క్లారిటీ ఇచ్చాడు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘థియేటర్స్ పడిపోతున్న సమయం లో థియేటర్స్ ఓనర్స్ చాలా ఆర్ధిక సంక్షోభానికి గురయ్యారు.. థియేటర్స్ ని రన్ చెయ్యలేక వాళ్ళే మా ముందుకు వచ్చి మీరే థియేటర్స్ రన్ చెయ్యండి..మాకు నెలకు రెంటల్ గా డబ్బులు ఇవ్వండి అని చెప్పారు..వాళ్ళు అలా చెప్పిన తర్వాతే మేము థియేటర్స్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాధీనం చేసుకున్నాము..మా చేతుల్లోకి ఆ థియేటర్స్ వచ్చిన తర్వాత ఎంతో అభివృద్ధి చేసాం..సాంకేతికంగా థియేటర్స్ ని ఉన్నత స్థాయిలో డెవలప్ చేసాం..అందువల్ల థియేటర్స్ కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య బాగా పెరిగింది..స్టార్ హీరోలకు సినిమాల్లో అవకాశాలు ఇవ్వగలుతున్నాము..లేకపోతే OTT కి అలవాటు పడిన ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం ఎప్పుడో మానేసేవారు’ అంటూ అల్లు అరవింద్ చెప్పుకొచ్చాడు.
థియేటర్స్ యజమానులు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారని..రూపాయి నష్టం లేకుండా వాళ్ళ బిజినెస్ మంచిగా సాగిపోతుందని అల్లు అరవింద్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు..ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోయింది.
https://www.youtube.com/watch?v=95C501gnKtI