spot_img
Homeఎంటర్టైన్మెంట్Ram Charan: ఆల్ ఇండియా షేక్, ఆరు సినిమాలకు సైన్ చేసిన రామ్ చరణ్... దర్శకులు...

Ram Charan: ఆల్ ఇండియా షేక్, ఆరు సినిమాలకు సైన్ చేసిన రామ్ చరణ్… దర్శకులు ఎవరంటే?

Ram Charan: తాను ఏకంగా ఆరు చిత్రాలకు సైన్ చేసినట్లు చెప్పి రామ్ చరణ్ షాక్ ఇచ్చాడు. రామ్ చరణ్ ప్రకటన చిత్ర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అధికారికంగా రెండు ప్రాజెక్ట్స్ రామ్ చరణ్ ప్రకటించగా మిగతా నాలుగు చిత్రాల దర్శకులు ఎవరనే ఆసక్తి మొదలైంది. ఆర్ ఆర్ ఆర్ మూవీతో రామ్ చరణ్ పాన్ వరల్డ్ హిట్ కొట్టారు. ఇండియాతో పాటు యూఎస్ బాక్సాఫీస్ షేక్ చేసిన ఆర్ ఆర్ ఆర్, జపాన్ సైతంలో సత్తా చాటుతుంది. ముత్తు, బాహుబలి 2, 3 ఇడియట్స్ చిత్రాల రికార్డ్స్ బ్రేక్ చేసి అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డులకు ఎక్కింది.

Ram Charan
Ram Charan

పలు అంతర్జాతీయ వేదికలపై మెరిసింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకుని దేశం మొత్తం గర్వపడేలా చేసింది. ఈ అరుదైన విజయంలో భాగమైనందుకు రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ఓ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చరణ్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ ఆరు చిత్రాలు లైన్లో పెట్టినట్లు వెల్లడించారు. 2023లో మూడు ప్రాజెక్ట్ 2024లో మరో మూడు చిత్రాలు చేయనున్నట్లు స్పష్టత ఇచ్చారు.

దర్శకుడు శంకర్ తో రామ్ చరణ్ RC – 15 చేస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. శంకర్ ఏక కాలంలో భారతీయుడు 2 సైతం పూర్తి చేస్తున్నారు. అందుకే షూటింగ్ కొంచెం ఆలస్యం అవుతుంది. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబుతో తన 16వ చిత్రం ప్రకటించారు. ఉప్పెన మూవీతో దర్శకుడిగా మారిన చిట్టిబాబు రెండో చిత్రం రామ్ చరణ్ తో చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.

Ram Charan
Ram Charan

ఈ క్రమంలో రామ్ చరణ్ చెప్పిన మరో నాలుగు ప్రాజెక్ట్స్ ఏమిటీ? దర్శకులు ఎవరు? అనేది ఆసక్తిగా మారింది. దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోసారి ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలిసి మల్టీస్టారర్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ చరణ్ చెప్పిన ఆరు చిత్రాల్లో ఒకటి కావచ్చనే సందేహం కలుగుతుంది. అయితే రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ తో మూవీ ప్రకటించారు. మరో ఐదారు నెలల్లో రాజమౌళి-మహేష్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండు మూడేళ్ల తర్వాత విడుదలవుతుంది. కాబట్టి రామ్ చరణ్ చెప్పిన ప్రాజెక్ట్స్ లిస్ట్ లో ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఉండకపోవచ్చు. ఏది ఏమైనా మెగా ఫ్యాన్స్ లో మాత్రం ఈ న్యూస్ జోష్ నింపింది.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version