
Ram Charan- Venkatesh: గత వారంరోజులుగా రామ్ చరణ్ పేరు వరల్డ్ వైడ్ మారుమ్రోగుతుంది. ఈ ఆర్ ఆర్ ఆర్ హీరో ప్రతిభను ప్రపంచ సినిమా ప్రముఖులు కొనియాడుతున్నారు. ఎవరికీ దక్కని గౌరవం రామ్ చరణ్ కి దక్కింది. అరుదైన మైలురాళ్లను ఆయన చేరుకున్నారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న ఏకైన ఇండియన్ యాక్టర్ గా రామ్ చరణ్ ఘనత సాధించారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ వేడుకకు అతిధిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్ లైట్ అవార్డుకు ఎంపికయ్యారు. అమెరికన్ ఆడియన్స్ లో రామ్ చరణ్ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.
నెక్స్ట్ ఆస్కార్ వేడుకలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. దీని కోసం రామ్ చరణ్ అమెరికాలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఒక ఇండియన్ వెడ్డింగ్ కి ఆయన హాజరయ్యారు. విక్టరీ వెంకటేష్ సైతం ఈ పెళ్ళికి హాజరు కావడం విశేషత సంతరించుకుంది. ఇక వధూవరులను పక్కన పెట్టిన బంధుమిత్రులు రామ్ చరణ్, వెంకీల పైకి తమ దృష్టి మళ్లించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ని ఉద్దేశిస్తూ వెంకటేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాటు నాటు సాంగ్ లో చరణ్ పెర్ఫార్మన్స్, ఆ పాటకు వచ్చిన అంతర్జాతీయ గుర్తింపు గురించి మాట్లాడారు. అలాగే అన్ని అవార్డ్స్ రామ్ చరణ్ కే. ఆయన అందుకు అర్హుడని పరోక్షంగా చెప్పారు.
రామ్ చరణ్ వినమ్రంగా వెంకీకి ధన్యవాదాలు చెప్పారు. పెళ్లి వేడుకలో ఉన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ ఇండియా గర్వంగా ఫీలయ్యే నటుడిగా ఎదిగాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన గురించి అమెరికన్ మీడియా, హాలీవుడ్ యాక్టర్లు చూపిస్తున్న ఆసక్తి, ఇస్తున్న ఎలివేషన్స్ ఇందుకు నిదర్శనం. ఇక నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రావడమే మిగిలి ఉంది. అది కూడా సాకారం అయితే ఒక గొప్ప సంఘటన ఆవిష్కృతమవుతుంది.

రామ్ చరణ్ జోరు చూస్తే భవిష్యత్తులో ఆయన హాలీవుడ్ యాక్షన్ హీరోగా ప్రపంచాన్ని ఊర్రూతలు ఊగించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇటీవల హాలీవుడ్ లో నటించాలన్న తన కోరికను రామ్ చరణ్ బయటపెట్టారు. అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని వెల్లడించారు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ఆర్సీ 15 చేస్తున్నారు. అనంతరం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుతో చేయనున్నట్లు వెల్లడించారు. నిర్మాత దిల్ రాజు ఆర్సీ 15 చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మీద అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
"All the Awards Goes to Mr. Charan" – @VenkyMama ❤️
FYI – Charan & Venkatesh Garu Attended a Private Wedding Event in the USA !!#ManOfMassesRamCharan @AlwaysRamCharan #RamCharan #Venkatesh #RRR #RRRMovie #RC #RC15 #GlobalStarRamCharan #ManOfMassesRamCharan pic.twitter.com/3EWj1CJxVa
— YouWe Media (@MediaYouwe) February 26, 2023