దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి, లాక్ డౌన్ వల్ల చాలామంది ఉద్యోగులు గతంలోలా కాకుండా ఇంటి నుంచి పని చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ద్వారా పని చేస్తున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగుల వేతనంతో పాటు ఆలవెన్స్ లు పన్ను పరిధిలోకి వస్తాయి. హౌస్ రెంట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్ లకు మాత్రం కొంతవరకు పన్ను మినహాయింపులు ఉంటాయి.

అయితే గత కొన్ని నెలలుగా కరోనా తీవ్రత దృష్ట్యా ఉద్యోగుల పర్యటనలకు వెళ్లే అవకాశాలు తగ్గడంతో పాటు రోజు వారీ రవాణా కూడా తగ్గుతుంది. ఫలితంగా ఉద్యోగులు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఆలవెన్సులను ఖర్చు చేసే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఉద్యోగులు ఈ ఆలవెన్సులకు సంబంధించిన పన్నును చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం పర్యాటక ప్రదేశాలపై ఆంక్షలు అమలవుతున్నాయి.
దీంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి పర్యటనలు చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. కరోనా మహమ్మారి పూర్తిస్థాయిలో కట్టడి కావడానికి చాలా నెలల సమయం పడుతుండటంతో సమీప భవిష్యత్తులో సైతం పర్యటనలపై ఉద్యోగులు ఏ మాత్రం ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఉద్యోగులు లీవ్ ట్రావెల్ అలవెన్స్ లను వినియోగించుకోలేరు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ చేసే ఉద్యోగులకు కరెంట్, ఇంటర్నెట్ వినియోగం కోసం అలవెన్స్ లు ఇస్తున్నాయి.
అయితే ఈ అలవెన్సులు కూడా పన్ను పరిధిలోకే వస్తాయని తెలుస్తోంది. కరోనా విజృంభణ వల్ల చాలామంది ఉద్యోగులు ఉన్న ఇళ్లను ఖాళీ చేసి సొంత ఇళ్లకు వెళుతున్నారు. అద్దె చెల్లింపులు చేయని ఉద్యోగులు హెచ్.ఆర్.ఏను క్లైమ్ చేసుకోవడం సాధ్యపడదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు పన్ను పరిధిలోకి వచ్చే అంశాలను సైతం దృష్టిలో ఉంచుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.