https://oktelugu.com/

Star Heroine : దక్షిణాది భాషలతో సహా హిందీలో క్రేజ్ ఉన్న స్టార్ హీరోయిన్ ఈమె.. ఎవరో గుర్తించారా?

తెలంగాణ హీరోయిన్ అయినా ఉత్తరాదిలో కూడా మంచి సినిమాలు చేసింది. ఆమె పేరు అదితి రావు హైదరి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా అనే చిత్రంతో పరిచయం అయింది.

Written By:
  • NARESH
  • , Updated On : May 16, 2023 / 10:29 PM IST
    Follow us on

    Star Heroine : హీరో హీరోయిన్లు తమ చిన్ననాటి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టుకోవడం కామనే. ఈ నేపథ్యంలో బర్త్ డే ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడంతో అవి వైరల్ గా నిలుస్తున్నాయి. చిన్ననాటి ఫొటోలు పెడుతూ ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తెలంగాణకు చెందిన ఓ ప్రముఖ హీరోయిన్ తన చిన్నప్పటి ఫొటో షేర్ చేయడంతో ప్రేక్షకులు సరైన రీతిలో స్పందించారు.

    తెలంగాణ హీరోయిన్ అయినా ఉత్తరాదిలో కూడా మంచి సినిమాలు చేసింది. ఆమె పేరు అదితి రావు హైదరి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా అనే చిత్రంతో పరిచయం అయింది. తరువాత వరుణ్ తేజ్ తో అంతరిక్షం సినిమాలో నటించింది. తరువాత నానిత వి శర్వానంద్ తో మహా సముద్రం, దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్ తో కలిసి నా అనామిక సినిమాలోనూ నటించి మెప్పించింది.

    తన కెరీర్ ప్రారంభంలో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్న ఆమె తమిళం, కన్నడ, తెలుగు, మలయాళం తదితర భాషల్లో నటించింది. హైదరాబాద్ లో పుట్టిపెరిగిన ఆమె పూర్వీకులు వనపర్తి సంస్థానంలో రాజులుగా చెబుతోంది. అంటే ఆమె పూర్వీకులు రాజవంశానికి చెందిన వారుగా సూచిస్తోంది. తన నటనతో అందరిని మెప్పించినా ప్రస్తుతం అవకాశాలు లేక ఇంటి వద్దే ఉంటోంది.

    సినీ కథానాయికలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా నిలుస్తుంటారు. తమ అందంతో అందరిని ఆకర్షిస్తారు. ఇలా వారి వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో పెడుతూ ముచ్చటిస్తుంటారు. అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటారు. మొత్తానికి సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం వారికి అలవాటే.