Bigg Boss 6 Telugu- Adi Reddy: బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుండి నేటి వరుకు ఫిజికల్ టాస్కులలో కానీ ఎంటర్టైన్మెంట్ లో కానీ తన బెస్ట్ వంద శాతం ఇవ్వడానికి ప్రయత్నం చేసిన కంటెస్టెంట్స్ లో ఒకరు ఆది రెడ్డి..ఒక రివ్యూయర్ గా, కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆది రెడ్డి ఇన్ని రోజులు హౌస్ లో కొనసాగడం అంటే మాములు విషయం కాదు.

ఈ వారం బిగ్ బాస్ నిర్వహించిన ‘టికెట్ 2 ఫినాలే’ టాస్కులో కూడా ఆది రెడ్డి కంటెస్టెంట్స్ అందరికంటే మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు..పాయింట్స్ లో కూడా ఆయనతో సరిసమానంగా ఫిజికల్ బలం ఉన్న రేవంత్ , రోహిత్ మరియు శ్రీహాన్ వంటి కంటెస్టెంట్స్ ని కూడా అధిగమించి నెంబర్ స్థానం లో నిలిచాడు..అయితే ఆయన టికెట్ గెలిచాడా లేదా అనేది ఈరోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ లో తెలుస్తుంది..అయితే వోటింగ్ లైన్ ప్రకారం ఆది రెడ్డి ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో చివరి రెండు స్థానాల్లో ఒకరిగా కొనసాగుతున్నారు.
ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ ఉంది..డబుల్ ఎలిమినేషన్ ద్వారా శనివారం రోజు ఆది రెడ్డి మరియు ఆదివారం రోజు ఫైమా ఎలిమినేట్ అయిపోతున్నట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి..ప్రస్తుతం ఆది రెడ్డి మరియు ఫైమా తో కలిపి ఇంట్లో 8 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు..ఈ 8 మందిలో వీళ్లిద్దరు ఎలిమినేట్ అయిపోతే ఇక ఆరుగురు మిగులుతారు..రేవంత్ , శ్రీహాన్ , రోహిత్ , కీర్తి ,ఇనాయ మరియు శ్రీ సత్య వీళ్ళు తదుపరి వారం కొనసాగుతారు.

వీరిలో ప్రస్తుతం ఉన్న వోటింగ్ ప్రకారం చూసుకుంటే వచ్చే వారం శ్రీ సత్య ఎలిమినేట్ అయిపోతుంది..అప్పుడు టాప్ 5 కంటెస్టెంట్స్ గా రేవంత్ , శ్రీహన్ , రోహిత్ , ఇనాయ , కీర్తి నిలుస్తారు..వీరిలో ప్రస్తుతానికి వోటింగ్ లైన్ లో రేవంత్ మరియు రోహిత్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ పోలింగ్ జరుగుతుంది..ఎవరు టైటిల్ కొట్టబోతున్నారు అనేది గ్రాండ్ ఫినాలే వరుకు ఊహించలేని పరిస్థితి ఏర్పడింది.