https://oktelugu.com/

Actress Pragathi : అప్పుడైతే బాగుండేది ఇప్పుడంటే కష్టం… రెండో పెళ్లిపై నటి ప్రగతి కామెంట్స్

Actress Pragathi  : స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి కాదు కానీ కంపానియన్షిప్ కావాలనిపిస్తుంది. కాకపోతే ఈ వయసులో సెట్ కాదేమో అని మనసులో మాట బయటపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రగతి 1997లో వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె హీరోయిన్ గా తమిళ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు. 1976లో పుట్టిన ప్రగతి 21 ఏళ్లకే వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆమె ఇష్టప్రకారం జరిగినట్లు తెలుస్తుంది. ఎర్లీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 3, 2023 7:26 pm
    Follow us on

    Actress Pragathi  : స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి రెండో వివాహంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి కాదు కానీ కంపానియన్షిప్ కావాలనిపిస్తుంది. కాకపోతే ఈ వయసులో సెట్ కాదేమో అని మనసులో మాట బయటపెట్టారు. అందుతున్న సమాచారం ప్రకారం ప్రగతి 1997లో వివాహం చేసుకున్నారు. అప్పటికి ఆమె హీరోయిన్ గా తమిళ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు. 1976లో పుట్టిన ప్రగతి 21 ఏళ్లకే వివాహం చేసుకున్నారు. ఈ వివాహం ఆమె ఇష్టప్రకారం జరిగినట్లు తెలుస్తుంది. ఎర్లీ మ్యారేజ్ తాను తీసుకున్న అతిపెద్ద బ్యాడ్ డెషిషన్ గా ప్రగతి అభివర్ణిస్తున్నారు. పెద్దవాళ్ళు, పేరెంట్స్ ని ఆమె బ్లేమ్ చేయడం లేదు.

    మనకు అంతా తెలుసు అనే ఓవర్ కాన్ఫిడెన్స్, మొండితనం వంటి కొన్ని కారణాలు పెళ్లి చేసుకునేలా చేశాయని ఆమె వాపోతున్నారు. ఇక తప్పుడు నిర్ణయాల వలన జరిగే పర్యవసానాల నుండి బయటపడటం కూడా కష్టమే అని ప్రగతి చెప్పుకొచ్చారు. ప్రగతి ప్రస్తుతం సింగిల్ మదర్ గా ఉన్నారు. భర్తకు విడాకులు ఇచ్చాక తన కూతురితో పాటు ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల ఆమె ఇంటర్వ్యూలో పాల్గొనగా… సెకండ్ మ్యారేజ్ చర్చకు వచ్చింది.

    మీకు సెకండ్ మ్యారేజ్ చేసుకునే ఆలోచన ఉందా అని అడగ్గా… పెళ్లి కాదు కానీ కంపానియన్షిప్ కోరుకుంటున్నాను. ఒక తోడు ఉంటే బాగుండు అనే ఆలోచన ఉంది. అయితే తన మెచ్యూరిటీకి తగిన వ్యక్తి దొరకాలి. ఎందుకంటే కొన్ని విషయాల్లో నేను పర్టిక్యులర్ గా ఉంటాను. 20 ఏళ్ల వయసులో అయితే అడ్జస్ట్ అయి బ్రతికేదాన్నేమో కానీ, ఇప్పుడు చాలా కష్టం, అని ప్రగతి తేల్చిపారేశారు. మరో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ప్రగతి హింట్ ఇచ్చారు.

    ప్రగతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె డాన్స్, వర్క్ అవుట్ వీడియోలు చేసి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తారు. ప్రగతి వర్క్ అవుట్ వీడియోలను పలువురు ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ వయసులో మీకు అవసరమా అంటూ కామెంట్స్ పెడుతూ ఉంటారు. నెగిటివ్ కామెంట్స్ ని ప్రగతి పట్టించుకోను అంటారు. హెల్త్ కోసం వ్యాయామం చేస్తున్నాను మీ చెత్త కామెంట్స్ నన్ను మార్చలేవంటూ… కౌంటర్స్ ఇస్తారు. 2002లో విడుదలైన బాబీ మూవీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన ప్రగతి సక్సెస్ ఫుల్ కెరీర్ లీడ్ చేస్తున్నారు.