Prakash Raj : ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ మహా కుంభమేళలో దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యాస్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు వివిధ రంగానికి చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మహా కుంభమేళాలో పుణ్యాస్నానాలు చేస్తున్నారు. అందరూ కూడా పవిత్ర త్రివేణి సంఘంలో పుణ్యాస్నానాలు చేసి పునీతులు అవుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా మహాకుంభమేళాకు గుర్తింపు ఉంది. దీంతో దేశ విదేశాల నుంచి కూడా భక్తులు ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు చేరుకుంటున్నారు. అక్కడికి వచ్చిన వారందరూ గంగమ్మ ఒడిలో స్నానాలు ఆచరిస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా అక్కడికి వచ్చి ఈ వేడుకలో పాల్గొంటున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఈ మహా కుంభమేళాకు సంబంధించి కొన్ని AI ఫోటోలు, షేక్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నాయి. అందరి దృష్టిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని వివాదాలకు కూడా కారణం అవుతున్నాయి. ఇటీవలే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ మహా కుంభమేళాలో పుణ్యా స్నానం ఆచరిస్తున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వతహాగా నాస్తికుడైన ప్రకాష్ రాజ్ ఈ మహాకుంభమేళాలో పాల్గొని పవిత్ర స్నానం ఆచరిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫోటోలు వైరల్ కావడంతో నటుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేనిది ఉన్నట్లు చూపించడంపై నటుడు మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై ఆయన పోలీసులను కూడా ఆశ్రయించడం జరిగింది.
ప్రకాష్ రాజ్ ప్రముఖ సామాజికవేత్త, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ ప్రశాంత్ సంబర్గి పై కేసును పెట్టారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ప్రకాష్ రాజ్ రాజకీయ వ్యాఖ్యాలతో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయన బిజెపి నిర్ణయాలను తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నటుడు ప్రకాష్ రాజ్ మహా కుంభమేళాలో పాల్గొని అక్కడ పవిత్ర స్నానం చేస్తున్నట్లు AI ఫోటోను క్రియేట్ చేయడం జరిగింది. ఈ ఫోటోను చూసిన చాలామంది ఇది నిజమే అనుకున్నారు. ఈ విషయంపై నటుడు ప్రకాష్ రాజ్ మైసూరు లోని లక్ష్మీపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రకాష్ రాజ్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకొని తన ఫోటోలను దుష్ప్రచారం చేస్తున్నారని, వెంటనే వీటిని అరికట్టాలని తన ఫిర్యాదులో తెలిపారు.
అయితే మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేయడంలో తప్పేమీ లేదు. అది వారందరి నమ్మకం. కానీ నాకు దేవుడు మీద నమ్మకం లేదు. నేను మనుషులను నమ్ముతాను. దేవుడు లేకుండా మనం జీవించగలము, కానీ మనుషులు లేకుండా మనం జీవించలేం అని నటుడు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈయన సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. విలన్ గా, హీరోగా, సపోర్టింగ్ పాత్రలలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈయన చేతుల్లో చాలా సినిమాలు ఉన్నట్లు సమాచారం
ಸುಳ್ಳು ಸುದ್ದಿ
“ಸುಳ್ಳ ರಾಜ” ನ ಹೇಡಿಗಳ ಸೈನ್ಯಕ್ಕೆ .. ಅವರ ಪವಿತ್ರ ಪೂಜೆಯಲ್ಲೂ ಸುಳ್ಳು ಸುದ್ದಿ ಹಬ್ಬಿಸಿ ಹೊಲಸು ಮಾಡುವುದೇ ಕೆಲಸ .. police complaint ದಾಖಲಾಗಿದೆ .. ಕೋರ್ಟಿನ ಕಟಕಟೆಯಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತಾರೋ ನೋಡೋಣ #justasking pic.twitter.com/S6ySeyFKmh— Prakash Raj (@prakashraaj) January 28, 2025