Largest Passenger Elevator: ఒకప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లేదా ఫస్ట్ ఫ్లోర్ లు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు చిన్న బిల్డింగ్ లకు అయినా నాలుగు ఐదు ఫ్లోర్ లు ఉంటున్నాయి. ఇక ప్రపంచంలో వందల ఫ్లోర్ లు ఉన్న బిల్డింగ్ లు కూడా ఉన్నాయి. అన్ని ఫ్లోర్ లు ఎక్కడం సాధారణ విషయం కాదు. అయిన అప్డేట్ జిందగీలో మెట్లతో పని ఏముంది.. లిఫ్ట్ ఉందిగా.. మరి చిన్న చిన్న బిల్డింగ్ లకు కూడా లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇంతకీ ప్రపంచం మొత్తంలో అతి పెద్ద లిఫ్ట్ ఎక్కడ ఉంది? దాని సామర్థ్యం ఎంతో తెలుసా?
లిఫ్టులు సాధారణంగా 10-15 మందిని తీసుకొని వెళ్తుంటాయి. కానీ మనం చెప్పుకోబోయే లిఫ్ట్ చాలా పెద్దది. వంద మందిని అయినా కూడా ఈజీగా తీసుకొని వెళ్తుంది. ఈ లిఫ్ట్ ఎక్కడో కాదు ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ఉంది. ఎంతమందిని అయినా సరే అలుపు లేకుండా తీసుకొని వెళ్లే ఈ లిఫ్ట్ ప్రపంచంలోనే చాలా పెద్దది. లోపలికి వెళ్తే చాలు ఫ్యాలెస్ లాగా కనిపిస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. ఇందులో కూర్చోవడానికి సోఫాలు కూడా ఉంటాయండోయ్. ఇందులో 20-30 మంది మాత్రమే వెళ్లగలరు కావచ్చు అనుకుంటున్నారా? పొరపాటు పడ్డట్టే.
ఈ భారీ లిఫ్ట్ లో ఏకంగా 200 మందికి పైగా ఈజీగా వెళ్లగలరు. ఇంత మందిని తీసుకెళ్లే లిఫ్ట్ బరువు ఏకంగా 17 టన్నులట. ఈ లిఫ్ట్ కు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో డోర్ బయట కొంతమంది నిల్చొని ఉండడం చూడవచ్చు. అయితే బిల్డింగ్ కు ఇదే మార్గం అనుకున్నారు కదూ మీరు కూడా.. కానీ గేటు తెరిస్తే ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించిందా..
ముందు చూస్తే విలాసవంతమైన తలుపు అనుకుంటారు. కానీ అది లిఫ్ట్ గేట్. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్తే ఒక్కసారి ఈ లిఫ్ట్ ను ఎక్కండి ప్యాలెస్ లో ఉన్న అనుభూతి వస్తుందట. సోఫాలు ఉన్నా కూడా లిఫ్ట్ లో 200 మంది వెళ్లగలరు అంటే ఈ లిఫ్ట్ ఎంత పెద్దదో అంచనా వేసుకోవచ్చు.