Pakistan: మా నాన్నకు పెళ్లి సినిమా చూశారా.. అందులో కృష్ణంరాజుకు శ్రీకాంత్ మళ్లీ పెళ్లి చేస్తాడు. ఇక వర్తమానానికి వస్తే దిల్ రాజుకు ఆమె కూతురు రెండో పెళ్లి చేసింది. సింగర్ సునీతకు ఆమె కుమారుడు, కుమార్తె ద్వితీయ వివాహం ఘనంగా జరిపించారు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. జీవితం అనేది బుడగ లాంటిది. ఆ చిన్న బుడగకు కూడా ఒక ప్రేమ కావాలి. సాంగత్యం కావాలి. మాట్లాడే తోడు కావాలి. గుండె లోతులో పుట్టుకు వచ్చే భావాలను పంచుకునే ఓ వ్యక్తి కావాలి. అప్పుడే ప్రేమ పరిడవిల్లుతుంది. సాంగత్యం వెళ్లి విరుస్తుంది.. కానీ ఆ మహిళకు ఇలాంటి అవకాశం లేదు. ఎందుకంటే తనకు ఒక కొడుకు పుట్టిన తర్వాత భర్తను కోల్పోయింది. తన కొడుకు ఎదుగుదల కోసం.. అతని ఉజ్వల భవిష్యత్తు కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. ఈ పరంపరలో ఆమెకు మరో తోడు కోసం తాపత్రంగాని .. మరో వ్యక్తి సాంగత్యం గాని ఆమెకు అవసరం పడలేదు. ఈలోపు ఆమె కొడుకు పెరిగాడు.. పెద్దయ్యాడు.. ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడ్డాడు. ఇక అతని ఆలోచన విధానం పూర్తి పరిపక్వతకు చేరుకుంది. దీంతో అతడు ఒక నిర్ణయం తీసుకున్నాడు.. అది అంతిమంగా అతడిని, అతడి తల్లిని పూర్తిగా మార్చేసింది.
మళ్లీ పెళ్లి చేశాడు
పాకిస్తాన్ దేశాల చెందిన అబ్దుల్ ఆహాద్ అనే బాలుడికి చిన్నతనంలోనే తండ్రి చనిపోయాడు. తల్లి అతడికి అన్నీ తానైంది. కష్టాలు ఎదుర్కొంది. కన్నీళ్లను దిగ మింగింది. ఆటుపోట్లను ధైర్యంగా అధిగమించగలిగింది. చివరికి తన కుమారుడిని ఉన్నత స్థానంలో చూడగలిగింది. తనకోసం ఎందుకు చేసినా తల్లికి ఏం చేసినా తక్కువేనని ఆ కుమారుడు భావించాడు. తనకు జీవితంలో ఒక తోడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమెకు చెప్పాడు. అయితే మొదట్లో ఆమె దీనికి ఒప్పుకోలేదు. బంధువుల సహాయంతో ఒప్పించే ప్రయత్నం చేశాడు. చివరికి ఆమెకు మళ్ళీ రెండో పెళ్లి చేశాడు. పాకిస్తాన్ మత నిబంధనల ప్రకారం ఒక మహిళ రెండో వివాహం చేసుకోకూడదు. ముఖ్యంగా భర్త చనిపోయిన మహిళ మళ్లీ పెళ్లి చేసుకోకూడదు. కానీ అబ్దుల్ ఆహాద్ ఆ చాందస విధానాలకు చరమగీతం పాడాడు. తన తల్లి కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించాడు. ఆమెకు మరో ప్రేమను ప్రసాదించాడు. కుమారుడిగా తన బాధ్యతను నిర్వర్తించాడు. అబ్దుల్ అహద్ చేసిన పని ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది..
పాకిస్తాన్ దేశానికి చెందిన అబ్దుల్ ఆహాద్ అనే యువకుడి తండ్రి చిన్న వయసులోనే చనిపోయాడు. తల్లి అతడికి అన్ని తానై అయింది. దీంతో తల్లికి కొత్త ప్రేమను, జీవితాన్ని అందించాలని వేరే వ్యక్తితో ఆమెకు దగ్గరుండి రెండో వివాహం చేయించాడు. pic.twitter.com/JblFwaj1SR
— Anabothula Bhaskar (@AnabothulaB) December 31, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: A pakistani man helped his mother remarry after 18 years and shared the video on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com