
Pakistan Man Married Indian Girl: మనదేశంలోకి అక్రమంగా చొరబడి ఆపై వివాహం చేసుకుని మరీ పిల్లల్ని కన్నాడు. మన దేశంతో శతృత్వం ఉన్నా అతడు ఈ ఘాతుకాని తెగించాడు. అక్రమ వలసదారుడిగా వచ్చి ఇక్కడే నాలుగేళ్లు సంసారం చేసి నలుగురు పిల్లల్ని కన్నాడు. ఈ నేపథ్యంలో భార్యా పిల్లలను స్వదేశానికి తీసుకెళ్లే క్రమంలో అధికారులకు చిక్కాడు. ఇక్కడే ఆధార్ కార్డు కూడా సంపాదించాడు. దీంతో అతడి నిర్వాకంతో అధికారులు నివ్వెర పోయారు. ఎలా దేశంలోకి చొరబడ్డాడు? ఆమెను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? ఏ ఉద్దేశంతో ఇక్కడకు వచ్చాడు? ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? అనే కోణంలో అధికారులు విచారిస్తున్నారు.
ఫోన్ కాల్ ద్వారా..
పాకిస్తాన్ కు చెందిన గుల్జార్ ఖాన్ నుంచి ఓ ఫోన్ కాల్ వచ్చింది. నంద్యాలకు చెందిన దౌలత్ బీ ఎవరని ప్రశ్నించగా తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరిలో ప్రేమ చిగురించింది. దీంతో ఇద్దరు తరచుగా ఫోన్ లో మాట్లాడుకునే వారు. గుల్జార్ సౌదీ అరేబియాలో పెయింటర్ గా పనిచేస్తున్నాడు. దౌలత్ బీకి ఏడేళ్ల క్రితం వివాహం అయింది. తన భర్త చనిపోవడంతో ఇంటి వద్దే ఉంటోంది. వీరి మధ్య ప్రేమ ముదరడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
దేశంలోకి అక్రమంగా చొరబడి
గుల్జార్ ముంబయి నుంచి అక్రమంగా నంద్యాల జిల్లా గడివేములకు చేరుకున్నాడు. 2011 జనవరి 25న దౌలత్ బీని వివాహం చేసుకున్నాడు. వారికి ముగ్గురు కూతుళ్లు, ఒక అబ్బాయి సంతానం కలిగారు. తొమ్మిదేళ్ల పాటు వీరి సంసారం సాఫీగానే సాగింది. ముంబై నుంచి సౌదీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్లాలన్నది అతడి ప్రణాళిక. 2019లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీ చేస్తుండగా గుల్జార్ అక్రమంగా భారత్ లోకి చొరబడినట్లు గుర్తించారు. అతడిని జైలుకు పంపారు.

భర్తను విడుదల చేయాలని వేడుకోలు
కట్టుకున్న వాడు దూరం కావడంతో దౌలత్ బీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇదివరకే భర్తను పోగొట్టుకున్న ఆమెకు గుల్జార్ దూరం కావడంతో ఆమె కష్టాలు తీరే మార్గం కనిపించలేదు. సంపాదించేవాడు జైలు పాలు కావడంతో ఏం చేయలేని పరిస్థితి. కరోనా సమయంలో గుల్జార్ జైలు నుంచి విడుదలైనా 2022లో మళ్లీ హైదరాబాద్ జైలుకు తరలించారు. తన భర్తను విడుదల చేయాలని దౌలత్ బీ కోర్టుల చుట్టూ తిరుగుతూ అందరిని వేడుకుంటోంది. దేశంలోకి అక్రమంగా చొరబడి నేరానికి పాల్పడటంతో అతడిని విడుదల చేసే ఆధారాలు కనిపించడం లేదు.