Pawan Kalyan Remunaration : 55 రోజుల్లో 80 కోట్లు.. ఇండియాలోనే ఎవరికీ సాధ్యం కానీ రికార్డుని నెలకొల్పిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan Remunaration : టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ , భీమ్లానాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని సూపర్ హిట్స్ అయ్యాయంటే అది కేవలం పవర్ స్టార్ స్టామినా వల్లే అని ట్రేడ్ పండితులు సైతం ఒప్పుకుంటున్నారు. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో పాన్ […]

Written By: NARESH, Updated On : February 9, 2023 7:05 pm
Follow us on

Pawan Kalyan Remunaration : టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఊపు ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. రీ ఎంట్రీ తర్వాత ఆయన చేసిన వకీల్ సాబ్ , భీమ్లానాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని సూపర్ హిట్స్ అయ్యాయంటే అది కేవలం పవర్ స్టార్ స్టామినా వల్లే అని ట్రేడ్ పండితులు సైతం ఒప్పుకుంటున్నారు. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న హీరో పాన్ ఇండియన్ సినిమాలు చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలు అలాంటివి. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని నిర్మించడం కోసం సుమారుగా 200 కోట్ల రూపాయిలను ఖర్చు చేసాడట నిర్మాత ఏఎం రత్నం.

ఈ సినిమాతో పాటుగా ప్రముఖ దర్శకుడు సుజిత్ తో #OG అనే మరో పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా ఇటీవలే మొదలయ్యాయి..ఈ సినిమా ప్రారంభం అయ్యే ముందే తమిళ రీమేక్ ‘వినోదయ్యా సీతం’ రీమేక్ లో నటించబోతున్నాడట పవన్ కళ్యాణ్.. ఇందులో ఆయనతో పాటుగా సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నాడు.ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చాడట.. ఈ 20 రోజులకు గాను పవన్ కళ్యాణ్ కి 20 కోట్ల రూపాయిల పారితోషికం ఇస్తున్నారట నిర్మాతలు.

ఇక #OG సినిమా కోసం కూడా పవన్ కళ్యాణ్ కేవలం 35 రోజుల కాల్స్ షీట్స్ ఇచ్చాడట..దీనికోసం ఆయనకు 60 కోట్ల రూపాయిల పారితోషకం ఉంటుందని సమాచారం. అలా కేవలం 55 రోజుల కాల్ షీట్స్ కోసం 80 కోట్ల రూపాయిల పారితోషికం అందుకుంటున్న ఏకైక ఇండియన్ హీరోగా పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.