Sankranthi Movies: 1999 టు 2022.. ఈ రెండు దశాబ్దాల్లో సంక్రాంతి విన్నర్స్ ఎవరో తెలుసా!

Sankranthi Movies: సంక్రాంతి అటు ఆడియన్స్ కి ఇటు మేకర్స్ కి చాలా స్పెషల్. పెద్ద పండగకు ఇంటిల్లపాది థియేటర్ కి వెళ్లి మంచి సినిమా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఇక నిర్మాతలకు ఇది కాసులు కురిపించే సీజన్ అని చెప్పాలి. అందుకే సంక్రాంతి పండగ టార్గెట్ గా సినిమాలు విడుదల చేస్తారు. ప్రతి ఏడాది మూడు నాలుగు చిత్రాలు విడులవుతాయి. విన్నర్ మాత్రం ఒకటే ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో సంక్రాంతికి హిట్ విజేతలుగా నిలిచిన చిత్రాలేమిటో చూద్దాం. 1999లో […]

Written By: Shiva, Updated On : January 12, 2023 8:44 am
Follow us on

Sankranthi Movies: సంక్రాంతి అటు ఆడియన్స్ కి ఇటు మేకర్స్ కి చాలా స్పెషల్. పెద్ద పండగకు ఇంటిల్లపాది థియేటర్ కి వెళ్లి మంచి సినిమా చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఇక నిర్మాతలకు ఇది కాసులు కురిపించే సీజన్ అని చెప్పాలి. అందుకే సంక్రాంతి పండగ టార్గెట్ గా సినిమాలు విడుదల చేస్తారు. ప్రతి ఏడాది మూడు నాలుగు చిత్రాలు విడులవుతాయి. విన్నర్ మాత్రం ఒకటే ఉంటుంది. గత రెండు దశాబ్దాల్లో సంక్రాంతికి హిట్ విజేతలుగా నిలిచిన చిత్రాలేమిటో చూద్దాం.

Sankranthi Movies

1999లో విడుదలైన సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్. చిరంజీవి డ్యూయల్ రోల్ చేసిన స్నేహం కోసం మాత్రం యావరేజ్ గా నిలిచింది. ఇక 2000లో వెంకటేష్-సిమ్రాన్ జంటగా విడుదలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కలిసుందాం రా బ్లాక్ బస్టర్ కొట్టింది. చిరంజీవి అన్నయ్య సైతం సూపర్ హిట్ అందుకుంది. ఇక 2001లో నరసింహనాయుడుగా బాలయ్య మరో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. చిరంజీవి మృగరాజు నిరాశపరిచింది.

2002లో అనూహ్యంగా తరుణ్ నువ్వు లేక నేను లేను మూవీ సంక్రాంతి విన్నర్ అయ్యారు. టక్కరి దొంగ, సీమ సింహం నిరాశపరిచాయి. 2003 సంక్రాంతికి ఒక్కడు మూవీతో మహేష్ ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఎన్టీఆర్ నాగ ఫెయిల్ అయ్యింది. ప్రభాస్ ఫస్ట్ హిట్ వర్షం 2004 సంక్రాంతి విన్నర్. బాలయ్య లక్ష్మీ నరసింహ సైతం హిట్ టాక్ తెచ్చుకుంది. చిరు అంజి నిరాశపరిచింది.

Sankranthi Movies

2005లో సిద్ధార్థ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా సంక్రాంతి విన్నర్. ఎన్టీఆర్ నా అల్లుడు ప్లాప్. 2006కి వెంకటేష్ ‘లక్ష్మీ’ సంక్రాంతి విన్నర్. రామ్ దేవదాస్ కూడా ఆడింది. 2007లో పూరి-బన్నీల దేశముదురు విన్నర్ గా నిలిచింది. ప్రభాస్ యోగి యావరేజ్ టాక్ అందుకుంది. ఇక 2008లో రవితేజ కృష్ణ హిట్, బాలయ్య ఒక్క మగాడు అట్టర్ ప్లాప్. 2009లో అనూహ్యంగా లేడీ ఓరియెంటెడ్ మూవీ అరుంధతి సంక్రాంతి విన్నర్ అయ్యింది.

Sankranthi Movies

హిట్ లేక సతమతమవుతున్న ఎన్టీఆర్ 2010లో అదుర్స్ తో హిట్ కొట్టాడు. 2011లో రవితేజ మిరపకాయ్ సంక్రాంతి విన్నర్. బాలయ్య పరమవీర చక్ర అట్టర్ ప్లాప్. బిజినెస్ మాన్ మూవీతో 2013 సంక్రాంతి విన్నర్ గా మహేష్ నిలిచాడు. 2013లో విడుదలైన మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్ కూడా కొట్టింది. 2014లో చరణ్ ‘ఎవడు’ విన్నర్ గా నిలిచింది. 2015 సంక్రాంతికి గోపాలా గోపాలా చిత్రంతో వెంకీ-పవన్ హిట్ కొట్టారు. పక్కా సంక్రాంతి చిత్రం సోగ్గాడే చిన్నినాయనా 2016 సంక్రాంతి విన్నర్ అయ్యింది. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సైతం హిట్ స్టేటస్ అందుకుంది.

2017లో చిరంజీవి కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150 విన్నర్. బాలయ్య గౌతమీ పుత్ర శాతకర్ణి సైతం హిట్ స్టేటస్ అందుకుంది . శతమానం భవతి మూవీతో శర్వానంద్ 2018 సంక్రాంతి విన్నర్ అయ్యాడు. చరణ్, బాలయ్య చిత్రాలను వెనక్కి నెట్టి ఎఫ్ 2 మూవీ 2019 సంక్రాంతి విన్నర్ అయ్యింది. 2020లో అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు రెండూ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఎక్కువ వసూళ్లతో బన్నీ విన్నర్ అయ్యాడు. ఇక 2021లో రవితేజ క్రాక్, 2022లో నాగార్జున-చైతూల బంగార్రాజు సంక్రాంతి విజేతలుగా నిలిచారు.