https://oktelugu.com/

KGF2: కెజిఫ్ 2 సినిమాకి ఎడిటింగ్ చేసి అందరి ద్రుష్టి ఆకర్షించిన ఈ 19 ఏళ్ల అబ్బాయి ఎవరో తెలుసా ?

KGF2: ఒక కన్నడ సినిమా దేశాన్ని షేక్ చేసిందంటే అది అందులోని బలమైన కంటెంట్ యే. దాన్ని అంతే అందంగా చూపించడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. దేశంలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతాకాదు.ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్నదే ‘కేజీఎఫ్2’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లు గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉన్నాయి. సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను దేశంలో ప్యాన్ ఇండియా లెవల్ లో అన్ని భాషల్లోనూ […]

Written By:
  • NARESH
  • , Updated On : April 13, 2022 / 09:27 PM IST
    Follow us on

    KGF2: ఒక కన్నడ సినిమా దేశాన్ని షేక్ చేసిందంటే అది అందులోని బలమైన కంటెంట్ యే. దాన్ని అంతే అందంగా చూపించడంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యాడు. దేశంలో బాహుబలి తర్వాత కేజీఎఫ్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతాకాదు.ఇప్పుడు దానికి కొనసాగింపుగా వస్తున్నదే ‘కేజీఎఫ్2’. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ లు గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉన్నాయి. సినిమా మరో రెండు రోజుల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాను దేశంలో ప్యాన్ ఇండియా లెవల్ లో అన్ని భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడా చూసినా కేజీఎఫ్2 మేనియానే కనిపిస్తోంది.

    గతంలో వచ్చిన కేజీఎఫ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఇప్పుడు కేజీఎఫ్2పై భారీ అంచనాలున్నాయి. పైగా ఇందులో బాలీవుడ్ అగ్రహీరో సంజయ్ దత్, రవీనాటాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేశ్ లాంటి దిగ్గజ నటీనటులు ఉండడంతో సినిమాకు మరింతగా హైప్ వచ్చింది.

    కరోనా కారణంగా పలు సార్లు వాయిదా పడ్డ కేజీఎఫ్2 చిత్రాన్ని ఎట్టకేలకు ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు రెడీ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమంటున్నారు. ఇప్పటికే చిత్రం యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే చిత్రానికి సంబంధించిన ఆసక్తికర వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వార్త చూసి ఇప్పుడు అందరూ అవాక్కవుతున్నారు.

    కేజీఎఫ్2 సినిమా కోసం పనిచేసిన వారిలో అందరూ తోపు టెక్నీషియన్లే కావడం విశేషం. కానీ ఈ సినిమా ఎడిటర్ ఎవరో తెలిస్తే నిజంగానే మీరు షాక్ అవుతారు. కేజీఎఫ్2 సినిమాను ఫైనల్ కట్ చేసింది సరిగా మీసాలు కూడా రాని 19 ఏళ్ల కుర్రాడు అని మీకు తెలుసా? నిజంగా ఇది నిజం.

    ఉజ్వల్ కులకర్ణి అనే కుర్రాడు కేజీఎఫ్2 మూవీ ఫైనల్ కట్ చేశాడట.. ఈ కుర్రాడు ఇదివరకూ చేసిన షార్ట్ ఫిలింస్, ఫ్యాన్ ఎడిట్స్ చూసిన కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఫిదా అయ్యాడు. ఎంతో అద్భుతంగా కట్ చేస్తున్న ఉజ్వల్ ప్రతిభను చూసి కేజీఎఫ్ తొలి భాగానికి అతడితో ఎడిటింగ్ చేయించాడు. అది స్క్రీన్ పై అద్భుతంగా వచ్చి ఎడిటింగ్ సూపర్ అంటూ ప్రశంసలు అందుకుంది. అందుకే అతడిని కేజీఎఫ్2 చిత్రానికి కూడా సోలో ఎడిటర్ గా ప్రశాంత్ నీల్ తీసుకున్నాడు. దీంతో ఇప్పుడు ఆ నూనుగు మీసాల కుర్రాడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది.

    ఇప్పటివరకూ రిలీజ్ అయిన కేజీఎఫ్2 పోస్టర్స్, టీజర్స్, టైలర్స్ రికార్డు వ్యూస్ వచ్చాయంటే అదంతా ఈ కుర్రాడి పనితనానికి నిదర్శనమట..కేజీఎఫ్2 ట్రైలర్ దేశంలోనే అత్యధిక వ్యూస్ సాధించడానికి ఈ కుర్రాడి ఎడిటింట్ కూడా కారణమట.. ఇంత చిన్న వయసులో దేశంలోనే అత్యధిక వ్యూస్ సాధించేలా కేజీఎఫ్2 మూవీని కట్ చేసిన ఉజ్వల్ కు మున్ముందు మరింత ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని అతడి ప్రతిభను చూసిన వారు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కుర్రాడి గురించే సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ సాగుతోంది.

    Also Read: KGF 2 Movie Dialogues: Popular dialogues from KGF Chapter 2 Trailer  

    స్టార్ హోటల్లో దాక్కున్న KGF రాకీ భాయ్ .. కారణం తెలిస్తే షాకింగే!