18 Pages Collections: రొటీన్ బిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటూ హిట్టు మీద హిట్టు కొడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు మార్కెట్ ఏర్పర్చుకున్న హీరో నిఖిల్..హ్యాపీ డేస్ చిత్రం నుండి మొన్న ఈ ఏడాది విడుదలైన ‘కార్తికేయ 2 ‘ వరకు ఆయన చేసిన ప్రతీ మూవీ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది..కార్తికేయ సిరీస్ ఆయన కెరీర్ ని మలుపు తిప్పింది అనే చెప్పాలి..కార్తికేయ చిత్రం ఆయనకి హీరోగా స్థిరమైన మార్కెట్ ని ఏర్పర్చగా.

కార్తికేయ 2 చిత్రం అతనికి ఏకంగా పాన్ ఇండియా రేంజ్ స్టార్ స్టేటస్ ని తెచ్చిపెట్టింది..అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఎవరైనా తదుపరి చిత్రానికి భారీ ఓపెనింగ్స్ ఊహిస్తారు..కానీ ఆయన హీరో గా నటించిన ’18 పేజెస్’ చిత్రానికి ఎందుకో ఊహించిన స్థాయి ఓపెనింగ్స్ అయితే రాలేదు..నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ..కమర్షియల్ మూవీ కాకపోవడం వల్ల కలెక్షన్స్ మాత్రం రాలేదు.
వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి మొదటి రోజు కనీసం రెండు కోట్ల షేర్ వసూళ్లు కూడా రాకపోవడం బాధాకరం..’కార్తికేయ 2′ తర్వాత వచ్చిన చిత్రం అనే బ్రాండ్ తో పాటుగా డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ అనే బ్రాండ్ కూడా తోడైంది..గీత ఆర్ట్స్ నుండి వస్తున్న మూవీ అంటే క్వాలిటీ ని ఒక రేంజ్ లో ఊహిస్తారు..అలా అంత పెద్ద కాంబినేషన్ కుదిరినప్పటికీ కూడా ఓపెనింగ్స్ కలిసి రాకపోవడం బాధాకరం..నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి మొదటి రోజు కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

సీడెడ్ లో పాతిక లక్షలు మరియు ఆంధ్ర ప్రాంతం లో కోటి రూపాయిలు గ్రాస్ వచ్చింది..మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి రెండు కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తే షేర్ కేవలం కోటి 20 లక్షలు మాత్రమే వచ్చింది..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా కోటి 75 లక్షలు షేర్ వసూళ్లు వచ్చాయి.