18 Pages Collections : ’18 పేజెస్ ‘ 2 రోజుల వసూళ్లు..క్రిస్మస్ రోజు కూడా వసూళ్లు లేవు

18 Pages Collections : ఏ హీరోకైనా భారీ సక్సెస్ తర్వాత వచ్చిన స్టార్ స్టేటస్ ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం..మరో లెవెల్ కి వెళ్లే విధంగానే సినిమాలు తియ్యాలి తప్ప..రేంజ్ ని తగ్గించుకొని సినిమాలు తియ్యడం కరెక్ట్ కాదు..అలా చేస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు అనడానికి ఉదాహరణగా నిలిచింది యంగ్ హీరో నిఖిల్ నటించిన ’18 పేజెస్ ‘ చిత్రం..కార్తికేయ 2 వంటి సంచలనం తర్వాత నిఖిల్ నుండి వచ్చిన సినిమా ఇది..25 కోట్ల […]

Written By: NARESH, Updated On : December 25, 2022 5:51 pm
Follow us on

18 Pages Collections : ఏ హీరోకైనా భారీ సక్సెస్ తర్వాత వచ్చిన స్టార్ స్టేటస్ ని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ముఖ్యం..మరో లెవెల్ కి వెళ్లే విధంగానే సినిమాలు తియ్యాలి తప్ప..రేంజ్ ని తగ్గించుకొని సినిమాలు తియ్యడం కరెక్ట్ కాదు..అలా చేస్తే ఆడియన్స్ రిజెక్ట్ చేస్తారు అనడానికి ఉదాహరణగా నిలిచింది యంగ్ హీరో నిఖిల్ నటించిన ’18 పేజెస్ ‘ చిత్రం..కార్తికేయ 2 వంటి సంచలనం తర్వాత నిఖిల్ నుండి వచ్చిన సినిమా ఇది..25 కోట్ల రూపాయిల మార్కెట్ ఉన్న నిఖిల్ ని పాన్ ఇండియా స్టార్ హీరో లెవెల్ లో నిలబెట్టింది కార్తికేయ 2 ..తెలుగు మరియు హిందీ భాషలకు కలిపి ఈ సినిమా దాదాపుగా 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది..అంత పెద్ద హిట్ తర్వాత ఎవరైనా తమ తదుపరి చిత్రానికి క్రేజీ డైరెక్టర్ ని ఎంచుకొని ముందుకి పోతారు..కానీ నిఖిల్ మాత్రం ముక్కు మొహం తెలియని ఒక నూతన డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని నిశ్చయించుకొని 18 పేజెస్ సినిమా తీసాడు..సరైన హైప్ లేక ఈ చిత్రం మొదటి రోజు నుండే డిజాస్టర్ కలెక్షన్స్ ని నమోదు చేసుకుంది..రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం.

 

ప్రాంతం: వసూళ్లు(షేర్):

నైజం 1.25 కోట్లు
సీడెడ్ 0.23 కోట్లు
ఉత్తరాంధ్ర 0.27 కోట్లు
ఈస్ట్ 0.18 కోట్లు
వెస్ట్ 0.10 కోట్లు
నెల్లూరు 0.06 కోట్లు
గుంటూరు 0.11 కోట్లు
కృష్ణ 0.08 కోట్లు
మొత్తం 2.28 కోట్లు

ఓవర్సీస్ 0.48 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.25 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 3.01 కోట్లు

60 కోట్ల రూపాయిల షేర్ కలెక్షన్స్ ని చూసి హీరో తదుపరి చిత్రానికి క్లోసింగ్ కలెక్షన్స్ కనీసం 5 కోట్లు కూడా లేకపోతే చాలా అవమానకరంగా ఉంటుంది..అందుకే కెరీర్ ని చక్కగా ప్లాన్ చేసుకొని ముందుకి పోవాలని..లేకపోతే ఎప్పటికి ఇలా మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోతావని నిఖిల్ ని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు..’18 పేజెస్’ ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 14 కోట్ల రూపాయలకు జరిగింది..బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 11 కోట్ల రూపాయిలు వసూళ్లను రాబట్టాలి..మొదటి రోజు కోటి 22 లక్షల రూపాయిలు షేర్ వసూళ్లు రాగ, రెండవ రోజు కోటి ఆరు లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి..స్టడీ కలెక్షన్స్ అయితే వచ్చాయి కానీ..ఇదే రేంజ్ వసూళ్లు వీక్ డేస్ లో మాత్రం అసలు ఉండవని అంటున్నారు ట్రేడ్ పండితులు..క్లోసింగ్ మహా అయితే 5 కోట్ల రూపాయిలు వస్తుందని..బయ్యర్స్ కి కనీసం 9 కోట్ల రూపాయిల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తుంది.