
Pathan Box Office Collection: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘పఠాన్’ బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే.జీరో వంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత సుమారు నాలుగేళ్ల పాటు విరామం తీసుకొని ఈ చిత్రాన్ని చేసాడు షారుక్ ఖాన్.యాక్షన్ జానర్ మూవీస్ అంటే పిచ్చెక్కిపోయ్యే బాలీవుడ్ ఆడియన్స్ కి షారుక్ ఖాన్ లాంటి స్టార్ అలాంటి జానర్ సినిమాలో చెయ్యడం.
Also Read: Amigos Collections: ‘అమిగోస్’ కి 50 శాతం కి పైగా నష్టాలు..నందమూరి హీరోల విజయయాత్ర కి బ్రేక్
దానికి తోడు అద్భుతమైన టీజర్ మరియు ట్రైలర్ అభిమానులను ఆకట్టుకోవడం తో భారీ అంచనాల నడుమ విడుదలైంది.ఓపెనింగ్స్ లో మొదటి రోజు 58 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను సాధించి ఆల్ టైం డే 1 రికార్డుని నెలకొల్పింది.ఆ తర్వాత లాంగ్ వీకెండ్ లోపే 500 కోట్ల రూపాయిల మార్కు ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు 20 రోజులకు గాను ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.
లేటెస్ట్ వీకెండ్ తో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలకు కలిపి 490 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది.నిన్న వచ్చిన వసూళ్లతో కలిపి ఈ సినిమా 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను దాటేసింది అంటున్నారు బాలీవుడ్ ట్రేడ్ పండితులు.ఇప్పటి వరకు హిందీ సినిమాలలో 500 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసిన ఏకైక సినిమా బాహుబలి 2 మాత్రమే.ఆ చిత్రం తర్వాత ఆ మార్కుని అందుకున్న ఏకైక సినిమా ఇదే.

అలా నెట్ వసూళ్ల పరంగా సంచలనం సృష్టించిన ఈ సినిమా, గ్రాస్ వసూళ్ల పరంగా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి ఈ వారమే అడుగుపెట్టబోతుంది.ఇప్పటి వరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో బాహుబలి 2 , kgF చాప్టర్ 2 మరియు #RRR సినిమాలు మాత్రమే ఈ అద్భుతమైన ఫీట్ ని అందుకున్నాయి,ఇప్పుడు ఆ జాబితాలోకి చేరిపోయాడు షారుక్ ఖాన్.రాబొయ్యే రోజుల్లో ఈ సినిమా #RRR ఫుల్ రన్ కలెక్షన్స్ ని దాటుతుందో లేదో చూడాలి.
Also Read: Nani Dasara Movie: కెజిఫ్, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో దసరాకు పోలికా… వివరణ ఇచ్చిన హీరో నాని!