Homeక్రైమ్‌Wife GPS Tracker In Slippers: భార్య చెప్పుల్లో జిపిఎస్ ట్రాకర్.. ఈ భర్త ఎందుకు...

Wife GPS Tracker In Slippers: భార్య చెప్పుల్లో జిపిఎస్ ట్రాకర్.. ఈ భర్త ఎందుకు ఆ పని చేశాడంటే..

Wife GPS Tracker In Slippers: ఇది దిగ్భ్రాంతి కలిగించే సంఘటన. సభ్య సమాజం తలదించుకునే దారుణం. పైగా అతడు అనేక సందర్భాల్లో చూశాడు. పద్ధతి మార్చుకోవాలని చెప్పి చూశాడు. అయినప్పటికీ ఆమె మారలేదు. పైగా మరింత బరితెగించింది. కట్టుకున్న భర్త కదా తట్టుకోలేకపోయాడు. తన భార్య బాగోతాన్ని బయటపెట్టాలనుకున్నాడు. చివరికి ఆ పని చేశాడు. బీహార్ రాష్ట్రంలో గత నెల ఆరవ తేదీన పాట్నాలోని పులివారి షరీఫ్ ఏక్తా నగర్లో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అతడి పేరు రాజేష్ (పేరు మార్చాం) ఇతడికి దివ్య (పేరు మార్చాం) అనే భార్య ఉంది. రాజేష్, దివ్య మొదట్లో అన్యోన్యంగానే ఉండేవారు. ఆ తర్వాత దివ్య ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. భర్త మీద ఏమాత్రం ఆసక్తిని చూపించేది కాదు. పైగా నిత్యం ఫోన్లోనే తల దూర్చేది. వాట్సప్ లో ఎప్పటికప్పుడు సందేశాలను క్లియర్ చేస్తూ ఉండేది. పైగా భర్త బయటకు వెళ్ళిపోగానే ఫోన్లలో గంటల తరబడి సంభాషణలు కొనసాగిస్తూ ఉండేది. ఈ వ్యవహారం రాజేష్ కు ఏమాత్రం నచ్చేది కాదు. అనేక సందర్భాల్లో దివ్యకు చెప్పి చూశాడు. అయినప్పటికీ ఆమె తన ప్రవర్తన మార్చుకోలేదు. పైగా అనుమానిస్తున్నామని భర్తను తిట్టేది. దీంతో ఎలాగైనా సరే భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని రాజేష్ అనుకున్నాడు. అయితే భార్యకు అనుమానం రాకుండా ఆ పని చేశాడు. ఎప్పటి మాదిరిగానే ఆమెతో ఉండడం మొదలుపెట్టాడు.

రాజేష్ పని మీద బయటకు వెళ్తే చాలు దివ్య ఫోన్లో ఉండేది. కొన్ని సందర్భాలలో ప్రియుడి వద్దకు వెళ్ళేది.. అయితే దివ్య ను ఎలాగైనా పట్టుకోవాలని అనుకున్న అతడు తన ప్లాన్ వర్కౌట్ చేశాడు. అతడు పని మీద బయటకు వెళ్లినట్టు నటించాడు. దాని కంటే ముందుగానే తన భార్య చెప్పులలో, ఇంట్లో జిపిఎస్ పరికరాలు అమర్చాడు. రాజేష్ బయటికి వెళ్లగానే.. దివ్య వెంటనే తన ప్రియుడు వద్దకు వెళ్ళిపోయింది.. తన ఫోన్ ద్వారా ఆమె జిపిఎస్ పొజిషన్ ను ట్రాక్ చేశాడు. ఆమె తన ప్రియుడు ఇంట్లో ఉన్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భార్యను నిలదీశాడు. దీంతో ఆమె కూడా అతనితో వాగ్వాదానికి దిగింది. ఆ తర్వాత అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

నేటి కాలంలో వివాహేతర సంబంధాలు సర్వసాధారణంగా మారిపోయాయి. భార్యకు తెలియకుండా భర్త.. భర్తకు తెలియకుండా భార్య అనైతికమైన బంధాలను కొనసాగిస్తున్నారు. చివరికి అడ్డంగా దొరికిపోతున్నారు. అయిన వాళ్ల ముందు.. కన్న వాళ్ళ ముందు.. దోషులుగా మిగిలిపోతున్నారు. ఇటువంటి బంధాలు సంసార జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులకు కారణమవుతుంటాయి. అందువల్లే భార్య భర్తలు పరస్పరం నమ్మకంతో సంసారం సాగించినప్పుడే ఆ దాంపత్యం కలకాలం సాగిపోతూ ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by For Men India (@for.men.india_)

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular